Mallika Sagar : ఐపీఎల్ మినీ వేలం.. ఆక్ష‌నీర్ మ‌ల్లికా సాగ‌ర్ ఎవ‌రో తెలుసా..?

ఐపీఎల్ చ‌రిత్ర‌లో మొద‌టి సారిగా ఓ మ‌హిళ వేలాన్ని నిర్వ‌హించ‌నుంది. ఆమె మ‌రెవ‌రో కాదు మ‌ల్లికా సాగ‌ర్‌.

IPL 2024 Mini Auction Who is Mallika Sagar

Mallika Sagar : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 వేలానికి అంతా సిద్ద‌మైంది. దుబాయ్ వేదిక‌గా మంగ‌ళ‌వారం వేలాన్ని నిర్వ‌హించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేసింది. భార‌త కాల‌మానం ప్ర‌కారం మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు వేలం ప్రారంభం కానుంది. ఇందులో దేశ‌, విదేశాల‌కు చెందిన 333 మంది ప్లేయ‌ర్లు వేలంలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. మొత్తం 10 ప్రాంఛైజీలు క‌లిపి 77 మంది ఆట‌గాళ్లను కొనుగోలు చేయ‌నున్నాయి.

చ‌రిత్ర‌లో తొలిసారి..

ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ 2008 నుంచి 2018 వ‌ర‌కు రిచ‌ర్డ్ మాడ్లీ ఆక్ష‌నీర్‌గా కొన‌సాగారు. ఆ త‌రువాత 2018 నుంచి హ్యు ఎడ్మిడ్స్ వేలాన్ని నిర్వ‌హించారు. అయితే.. 2022 వేలం మ‌ధ్య‌లో ఆయ‌న అనారోగ్యానికి గురి కావ‌డంతో చారు శ‌ర్మ మిగ‌తా వేలాన్ని కొన‌సాగించారు. కాగా.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో మొద‌టి సారిగా ఓ మ‌హిళ వేలాన్ని నిర్వ‌హించ‌నుంది. ఆమె మ‌రెవ‌రో కాదు మ‌ల్లికా సాగ‌ర్‌. ఈ విష‌యాన్ని బీసీసీఐ ఇప్ప‌టికే తెలియ‌జేసింది. దీంతో ఆమె ఎవ‌రు అని నెటిజ‌న్లు సెర్చ్ చేస్తున్నారు.

Ruturaj Gaikwad : అయ్యో పాపం.. రుతురాజ్ బ‌స్సు ఎక్కేందుకు వ‌స్తే.. ముఖం మీదే డోర్ వేసిన డ్రైవ‌ర్‌.. వీడియో వైర‌ల్‌

ఓ ఆర్ట్ క‌లెక్ట‌ర్‌..

48 ఏళ్ల మల్లికా సాగర్ ముంబైకి చెందిన ఓ ఆర్ట్‌ కలెక్టర్‌. ఆక్ష‌న్‌లు నిర్వ‌హించ‌డంలో ఆమెకు ఎంతో అనుభ‌వం ఉంది. గ‌త 20 సంవ‌త్స‌రాల‌కు పైగా వేలం నిర్వాహ‌కురాలిగా ప‌ని చేస్త్తున్నారు. 2021లో ప్రొ క‌బ‌డ్డీ లీగ్ వేలంలో ఆమె త‌న వాక్ చాతుర్యంతో అంద‌రిని ఆక‌ట్టుకుంది. అదే విధంగా మొట్ట‌మొద‌టి సారిగా నిర్వ‌హించిన మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్ 2023) వేలానికి కూడా ఆమెనే ఆక్ష‌నీర్‌గా వ్య‌వ‌హరించింది. తాజాగా డిసెంబ‌ర్ 9న జ‌రిగిన రెండ‌వ డ‌బ్ల్యూపీఎల్ సీజ‌న్‌కు సంబంధించిన వేలాన్ని కూడా మ‌ల్లిక‌నే నిర్వ‌హించింది. ఇప్పుడు ఐపీఎల్ 2024 వేలాన్ని నిర్వ‌హించేందుకు సిద్ద‌మైంది.

ప్రీగా చూడొచ్చు..

ఐపీఎల్ 2024 మినీ వేలాన్ని స్టార్ స్పోర్ట్స్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఐపీఎల్ ఓటీటీ హ‌క్కుల‌ను జియో సినిమాస్ కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో జియో సినిమాస్‌లో ఈ వేలాన్ని ఫ్రీగా చూడొచ్చు.

Naveen Ul Haq : న‌వీన్ ఉల్ హ‌క్ పై 20 నెల‌ల నిషేదం.. మ్యాంగో మ్యాన్‌ చేసిన తప్పేంటి..?