IPL 2024 : మాయ చేసిన గంభీర్‌.. అగ్ర‌స్థానానికి కేకేఆర్‌.. కోహ్లీ, రోహిత్ టీమ్‌లు ఎక్క‌డంటే?

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి.

IPL 2024 : మాయ చేసిన గంభీర్‌.. అగ్ర‌స్థానానికి కేకేఆర్‌.. కోహ్లీ, రోహిత్ టీమ్‌లు ఎక్క‌డంటే?

Photo Credit : www. IPLT20.COM

IPL 2024 points table : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. అండ‌ర్ డాగ్స్‌గా బ‌రిలోకి దిగిన జ‌ట్లు అంచ‌నాల‌ను మించి రాణిస్తుండ‌గా, ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగిన జ‌ట్లు చ‌తికిల ప‌డుతున్నాయి. మ్యాచ్ మ్యాచ్‌కు పాయింట్ల ప‌ట్టిక‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పులు చోటుచేసుకుంటుంన్నాయి ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 16 మ్యాచులు పూర్తి అయ్యాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో ఉన్న జ‌ట్టు ఏదీ, ఆఖ‌రి స్థానంలో ఉన్న జ‌ట్టు ఏదీ. మిగిలిన జ‌ట్లు ఏ స్థానాల్లో ఉన్నాయో ఓ సారి చూసేద్దాం..

– బుధ‌వారం విశాఖ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై ఘ‌న విజ‌యం సాధించ‌డంతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలోకి దూసుకువ‌చ్చింది. ఈ సీజ‌న్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ కేకేఆర్ విజ‌యం సాధించింది. 6 పాయింట్ల‌తో +2.518 నెట్‌ రన్‌రేట్‌ను క‌లిగి ఉంది.

– ఆడిన మూడు మ్యాచుల్లో గెలుపొందిన‌ప్ప‌టికీ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రెండో స్థానంలోనే ఉంది. కేకేఆర్ నెట్‌ర‌న్‌రేట్ కంటే త‌క్కువ ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం. 6 పాయింట్ల‌తో +1.249 నెట్ రన్‌రేట్‌ను ఆర్ఆర్ క‌లిగి ఉంది.

– పాయింట్ల ప‌ట్టిక‌లో రుతురాజ్ సార‌ధ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ మూడో స్థానంలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచులు ఆడ‌గా రెండు మ్యాచుల్లో గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. 4 పాయింట్లతో పాటు +0.976 నెట్‌ర‌న్‌రేట్ ఉంది.

– మూడు మ్యాచులు ఆడ‌గా రెండు మ్యాచుల్లో గెలిచి ఓ మ్యాచ్‌లో ఓడిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నాలుగో స్థానంలో ఉంది. ఆ జ‌ట్టు ఖాతాలో 4 పాయింట్ల‌తో పాటు +0.483 నెట్‌రన్ రేట్ ఉంది.

IPL 2024 : కేకేఆర్‌ యువ సంచలనం అంగ్క్రిష్ రఘువంశీ ఎవరు?

– కొత్త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ ఐదో స్థానంలో ఉంది. మూడు మ్యాచులు ఆడ‌గా రెండు మ్యాచుల్లో గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉండ‌గా నెట్ రన్ రేట్ -0.738గా ఉంది.

– సన్‌రైజర్స్ హైదరాబాద్ విష‌యానికి వ‌స్తే ఆరో స్థానంలో ఉంది. మూడు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్ర‌మే గెలిచింది. రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో 2 పాయింట్లు ఉండ‌గా నెట్ రన్ రేట్ +0.204గా ఉంది.

– ఏడో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. మూడు మ్యాచులు ఆడ‌గా ఒక్క మ్యాచులో మాత్ర‌మే గెలిచింది. ఆ జ‌ట్టు ఖాతాలో 2 పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ -0.337.

– అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఎనిమిదో స్థానంలో ఉంది. నాలుగు మ్యాచులు ఆడిన ఆ జ‌ట్టు ఒక్క‌టంటే ఒక్క‌టే మ్యాచ్‌లో గెలుపొందింది. మూడు మ్యాచులు ఓడిపోయిన ఆ జ‌ట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ -0.876గా ఉంది.

Rishabh Pant : కోల్‌క‌తాపై ఘోర ఓట‌మి.. పంత్‌కు రూ.24 ల‌క్ష‌ల జ‌రిమానా..

– నాలుగు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌లోనే గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొమ్మిదో స్థానంలో ఉంది. ఆ జ‌ట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉండ‌గా నెట్ రన్ రేట్ -1.347గా ఉంది.

– ఇక ఈ సీజ‌న్‌లో గెలుపుబోణీ కొట్ట‌ని ముంబై ఇండియ‌న్స్ ఆఖ‌రి స్థానంలో నిలిచింది. మూడు మ్యాచులు ఆడిన ముంబై ఒక్క మ్యాచులోనూ గెల‌వ‌లేదు. ఆ జట్టు నెట్ రన్ రేట్ -1.423గా ఉంది.