RCB
RCB Squad IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 2025కు సంబంధించిన మెగా వేలం రసవత్తరంగా కొనసాగింది. ఐపీఎల్ లో పాల్గొనే మొత్తం పది ప్రాంచైజీలు వేలంలో పాల్గొన్నాయి. రెండు రోజులు జరిగిన వేలంలో మొత్తం 182 మంది క్రికెటర్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది విదేశీల ఆటగాళ్లు ఉన్నారు. ఎనిమిది మందిని జట్లు ఆర్టీఎం చేసుకున్నాయి. అన్ని జట్లు కలిపి ఆటగాళ్ల కోసం మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. ఇదిలాఉంటే.. ఈ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ యాజమాన్యం ఆటగాళ్ల కొనుగోలులో గతంకంటే కాస్త భిన్నంగా వ్యవహరించింది. రెండు రోజులు జరిగిన వేలంలో ఆర్సీబీ యాజమాన్యం 22 మంది క్రికెటర్లను దక్కించుకుంది. ఇందులో ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
Also Read: IPL 2025: కావ్య పాప సెలెక్షన్ వేరే లెవల్.. ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ పూర్తి జట్టు ఇదే
ఆర్సీబీ జట్టు అంటే పేరున్న క్రికెటర్లకు వేదికగా ఇన్నాళ్లు ఉండేది. భారత్ జట్టులోని కీలక ఆటగాళ్లతోపాటు.. విదేశీ జట్లలోని కీలక ఆటగాళ్లతో ఆర్సీబీ జట్టు నిండిపోయి ఉండేది. అయినా ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారిగాకూడా విజేతగా ఆర్సీబీ జట్టు నిలవలేక పోయింది. అయినా ఆ జట్టును అభిమానించే అభిమానుల సంఖ్య చాలాఎక్కువే. ప్రతీ సీజన్ లో తమ అభిమాన జట్టు టోర్నీ విజేతగా నిలుస్తుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నప్పటికీ.. ఆర్సీబీ జట్టు మాత్రం నిరాశ పరుస్తూనే వస్తోంది. అయితే, ఈసారి ఫ్యాన్స్ కోరిక నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ యాజమాన్యం ప్లేయర్లను దక్కించుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించింది. ఈ క్రమంలో సీనియర్, యువ ఆటగాళ్లతో ఆ జట్టు పైపర్ పై బలంగా కనిపిస్తోంది. దీంతో ఈసారి ఐపీఎల్ విజేత ఆర్సీబీ జట్టే అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఆర్సీబీ పూర్తి జట్టు ఇలా..
విరాట్ కోహ్లీ (21కోట్లు), యశ్ దయాల్ (5 కోట్లు), రజత్ పటిదార్ (11 కోట్లు), హేజిల్ వుడ్ (12కోట్లు), ఫిల్ సాల్ట్ (11.50 కోట్లు), జితేశ్ శర్మ (11 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (10.75 కోట్లు), లివింగ్ స్టన్ (8.75 కోట్లు), రసిక్ దర్ (6కోట్లు), కృనాల్ పాండ్య (5.75 కోట్లు), టిమ్ డేవిడ్ (3కోట్లు), జాకబ్ బెథెల్ (2.60 కోట్లు), సుయాష్ శర్మ (2.60 కోట్లు), దేవ్ దత్ పడిక్కల్ (2కోట్లు), నువాన్ తుషార (1.60కోట్లు), రొమారియో షెఫర్డ్ (1.50 కోట్లు), ఎంగిడి (కోటి), స్వప్నిల్ సింగ్ (50లక్షలు), మోహిత్ రాధే (30 లక్షలు), అభినందన్ సింగ్ (30లక్షలు), స్వస్తిక్ చికారా (30లక్షలు), మనోజ్ భాండాగే (30లక్షలు).
Experience, Balance and Power, the ultimate base,
Our Class of ‘25 is ready to embrace! 👊#PlayBold #ನಮ್ಮRCB #IPLAuction #BidForBold #IPL2025 pic.twitter.com/4M7Hnjf1Di
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 25, 2024