IPL 2025: కావ్య పాప సెలెక్షన్ వేరే లెవల్.. ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ పూర్తి జట్టు ఇదే

తోలి రోజు వేలంలో దూకుడు కనబర్చిన కావ్య మారన్.. కావాల్సిన ఆటగాళ్లకోసం ఇతర ప్రాంఛైజీలతో పోటీపడి మరీ దక్కించుకున్నారు.

IPL 2025: కావ్య పాప సెలెక్షన్ వేరే లెవల్.. ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ పూర్తి జట్టు ఇదే

Kavya Maran

Updated On : November 26, 2024 / 7:33 AM IST

SRH Squad IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 2025కు సంబంధించిన మెగా ఆక్షన్ రసవత్తరంగా కొనసాగింది. ఐపీఎల్ ఆడే మొత్తం పది ప్రాంచైజీలు ఇందులో పాల్గొన్నాయి. వేలంలో మొత్తం 182 మంది క్రికెటర్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది విదేశీల ఆటగాళ్లు ఉన్నారు. ఎనిమిది మందిని జట్లు ఆర్టీఎం చేసుకున్నాయి. అన్ని జట్లు కలిపి ఆటగాళ్ల కోసం మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. ఇదిలాఉంటే.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించి క్రికెటర్ల కొనుగోలులో ఆ ప్రాంఛైజీ యాజమాని కావ్య మారన్ చాలా తెలివిగా వ్యవహరించారు. జట్టుకు కావాల్సిన ఆటగాళ్లపై మాత్రమే ఫోకస్ పెట్టి సెలెక్టివ్ గా ఆటగాళ్లను వేలంలో దక్కించుకున్నారు.

Also Read : IPL Mega Auction 2025 : అఫ్గానిస్థాన్ యువ స్పిన్నర్ పై కోట్ల వ‌ర్షం.. 18 ఏళ్ల చిన్నోడికి రూ.4.8 కోట్లు

ఆది, సోమవారాల్లో ఐపీఎల్ 2025కు సీజన్ కు సంబంధించిన వేలం ప్రక్రియ జరగ్గా.. తొలి రోజు వేలంలో దూకుడు కనబర్చిన కావ్య మారన్.. కావాల్సిన ఆటగాళ్లకోసం ఇతర ప్రాంఛైజీలతో పోటీపడి మరీ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్, మహ్మద్ షమి, హర్షల్ పటేల్ వంటి ఆటగాళ్లను తక్కువ ధరకే దక్కించుకున్నారని చెప్పొచ్చు. అంతకుముందు క్లాసెన్, పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, హెడ్, నితీశ్ కుమార్ లను రిటైన్ చేసుకున్న ఆ జట్టు యాజమాన్యం.. రెండు రోజులు జరిగిన వేలంలో 20 మంది క్రికెటర్లను దక్కించుకుంది. ఇందులో ఏడుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు.

Also Read: Virat Kohli : అకాయ్ కోహ్లీ పిక్ ఇదేనా? అస‌లు నిజం చెప్పిన కోహ్లీ సోద‌రి.. ఎంత‌ప‌నాయ‌రా?

కావ్య పాప ఈసారి వేలంలో ప్లేయర్లను దక్కించుకునే విషయంలో చాలా హోంవర్క్ చేసినట్లు తాజా జట్టును చూస్తే అర్ధమవుతుంది. పేపర్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అనుభవం ఉన్నఆటగాళ్లు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉందని చెప్పొచ్చు. మొత్తానికి వేలంలో ఆటగాళ్ల ఎంపిక విషయంలో కావ్య పాప సూపర్ అంటూ ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే..
క్లాసెన్ (23కోట్లు), పాట్ కమిన్స్ (18కోట్లు), అభిషేక్ శర్మ (14 కోట్లు,) ట్రానిస్ హెడ్ (14కోట్లు), ఇషాన్ కిషన్ (11.25 కోట్లు), మహ్మద్ షమి (10 కోట్లు), హర్షల్ పటేల్ (8 కోట్లు), నితీశ్ కుమార్ రెడ్డి (6 కోట్లు), అభినవ్ మనోహర్ (3.20 కోట్లు), రాహుల్ చాహర్ (3.20 కోట్లు), ఆడమ్ జంపా (2.40 కోట్లు), సిమర్జీత్ సింగ్ (1.50 కోట్లు), ఇషాన్ మలింగ (1.20 కోట్లు), బ్రైడెన్ కార్సే ( కోటి), జయ్ దేవ్ ఉనద్కత్ (కోటి), కమిందు మెడిస్ ( 75 లక్షలు), జిషాన్ అన్సారీ (40లక్షలు), సచిన్ బేబీ (30లక్షలు), అంకిత్ వర్మ (30లక్షలు), అథర్య తైడే (30లక్షలు).