Virat Kohli : అకాయ్ కోహ్లీ పిక్ ఇదేనా? అస‌లు నిజం చెప్పిన కోహ్లీ సోద‌రి.. ఎంత‌ప‌నాయ‌రా?

విరాట్ కోహ్లీ, బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌ల కుమారుడు అకాయ్ కోహ్లీ ఇత‌డేనంటూ నిన్న‌టి నుంచి సోష‌ల్ మీడియాలో ఓ ఫోటో వైర‌ల్‌గా మారింది.

Virat Kohli : అకాయ్ కోహ్లీ పిక్ ఇదేనా? అస‌లు నిజం చెప్పిన కోహ్లీ సోద‌రి.. ఎంత‌ప‌నాయ‌రా?

Akaay Kohli viral image real Virat Kohli sister clears the air

Updated On : November 25, 2024 / 4:44 PM IST

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ, బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌ల కుమారుడు అకాయ్ కోహ్లీ ఇత‌డేనంటూ నిన్న‌టి నుంచి సోష‌ల్ మీడియాలో ఓ ఫోటో వైర‌ల్‌గా మారింది. దీనిపై కోహ్లీ సోద‌రి భావ‌నా కోహ్లీ ధింగ్రా స్పందించింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌లు విష‌యాన్ని చెప్పుకొచ్చింది. అత‌డు అకాయ్ కాద‌ని చెప్పింది. కోహ్లీ, అనుష్కల స్నేహితుడి కూతురు అని తెలిపింది.

పెర్త్ టెస్టు మూడో రోజు ఆట‌లో కోహ్లీ సెంచరీ చేసిన అనంత‌రం త‌న స‌తీమ‌ణీ అనుష్క శ‌ర్మ ఉన్న గ్యాల‌రీ వైపు తిరిగి ఫ్ల‌యింగ్ కిస్‌లు ఇచ్చాడు. ఈ క్ర‌మంలో కెమెరామెన్‌లు గ్యాల‌రీలో ఉన్న అనుష్క‌పై ఫోక‌స్ పెట్టాయి. అనుష్క వెనుక ఓ వ్య‌క్తి చేతిలో ఓ చిన్నారి క‌నిపించింది. దీంతో అత‌డు కోహ్లీ కొడుకేన‌ని, అచ్చం తండ్రికి జిరాక్స్ కాఫీలా ఉన్నాడ‌ని చెబుతూ నెట్టింట వైర‌ల్‌గా ఆ పిక్స్ మారాయి.

IPL Mega Auction 2025 : అరెరె.. కొద్దిలో మిస్సైందిగా.. బెంగ‌ళూరు వ‌ద్దంటే.. డుప్లెసిస్‌ ను ఎవ‌రు తీసుకున్నారో తెలుసా?

దీనిపై విరాట్ కోహ్లి సోదరి.. భావనా ​​కోహ్లీ ధింగ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. ఇది పూర్తిగా త‌ప్పు అని చెప్పింది. విరాట్, అనుష్క స్నేహితుడి కూతురు అని చెప్పింది. ఆ ఫోటోలో క‌నిపిస్తుంది అకాయ్ కాదు. ధ‌న్య‌వాదాలు అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది.

కోహ్లీ, అనుష్క‌ల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. వీరిని మీడియాకు దూరంగా ఉంచుతూ పెంచుతున్నారు. కెమెరాల కంట ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. త‌మ పిల్ల‌ల ఫోటోలు, వీడియోలు తీయ‌వ‌ద్ద‌ని మీడియా సంస్థ‌ల‌ను ఇప్ప‌టికే ఈ జంట విజ్ఞ‌ప్తి చేసిన సంగ‌తి తెలిసిందే.

IND vs AUS : అందుకే ఓడిపోయాం.. రెండో టెస్టులో మేమేంటో చూపిస్తాం.. ఆసీస్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ కామెంట్స్‌