IND vs AUS : అందుకే ఓడిపోయాం.. రెండో టెస్టులో మేమేంటో చూపిస్తాం.. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కామెంట్స్
తొలి టెస్టులో ఓటమి తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు

Pat Cummis shows disappointment after losing to India
తొలి టెస్టులో ఓటమి తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. బ్యాటింగ్ వైఫల్యంతో పాటు ప్రణాళికలను సరిగ్గా అమలు చేయకపోవడంతోనే తాము ఓడిపోయామని చెప్పుకొచ్చాడు. రెండో టెస్టుకు చాలా సమయం ఉంది. రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న అనంతరం రెండో టెస్టుకు సన్నద్ధం అవుతామని తెలిపాడు.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకువెళ్లింది. 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 238 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌లు చెరో మూడేసి వికెట్లు తీశాడు. వాసింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. నితీశ్‌కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాలు తలా ఓ వికెట్ తీశారు.
మ్యాచ్ అనంతరం ఓటమి పై ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించాడు. ఓటమి తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పాడు. మ్యాచ్ కోసం చాలా బాగా సన్నద్ధం అయ్యామని తెలిపాడు. అయితే.. వ్యూహాలను సరిగ్గా అమలు చేయకపోవడం, బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలం అవడం తమ ఓటమికి కారణాలుగా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో ఏదీ కలిసి రాలేదన్నాడు. రెండో రోజు నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయానని చెప్పాడు.
మొదటి రోజు ఆటలో బ్యాటింగ్‌లో విఫలం కావడం నష్టం చేసిందన్నాడు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపాడు. తొలి టెస్టులో చేసిన తప్పిదాలపై చర్చిస్తామని, రెండో టెస్టులో మెరుగైన ప్రదర్శన చేస్తామన్నాడు. ఇక రెండు రోజులు విశ్రాంతి తీసుకుని అడిలైడ్‌లో ప్రాక్టీస్ మొదలుపెడుతామని చెప్పాడు.
WTC : డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానంకు భారత్ జట్టు.. రెండో ప్లేస్‌లో ఆస్ట్రేలియా
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్ 150 ఆలౌట్
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 104 ఆలౌట్
భారత్ మూడో ఇన్నింగ్స్ 487/6 డిక్లేర్డ్
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 238 ఆలౌట్