WTC : డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానంకు భారత్ జట్టు.. రెండో ప్లేస్‌లో ఆస్ట్రేలియా

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (2023 -25) ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ నెలలో ఇంగ్లాండ్ వేదికగా జరుగుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో తలపడాంటే పాయింట్ల పట్టికలో

WTC : డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానంకు భారత్ జట్టు.. రెండో ప్లేస్‌లో ఆస్ట్రేలియా

Teamindia

Updated On : November 25, 2024 / 2:29 PM IST

WTC Points Table : ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ2023-25) పాయింట్ల పట్టికలో టీమిండియా మళ్లీ అగ్రస్థానానికి చేరింది. న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ లలో అన్ని మ్యాచ్ లలో ఇండియా ఓడిపోవడంతో డబ్ల్యూటీసీ పట్టికలో మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. అయితే, బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది. దీంతో మళ్లీ టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

Also Read: IND vs AUS : ఇండియాదే పెర్త్ టెస్ట్.. 295 పరుగుల తేడాతో ఆసీస్ పై భారత్ ఘన విజయం

పెర్త్ టెస్టు విజయం తరువాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. భారత్ 61.11శాతం విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా జట్టు 57.69శాతంతో రెండో స్థానంకు దిగజారింది. శ్రీలంక జట్టు 55.56శాతంతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. 54.55 శాతం విజయాలతో న్యూజిలాండ్ జట్టు నాల్గో స్థానంలో ఉంది. ఇక దక్షిణాఫ్రికా జట్టు 54.17 శాతంతో ఐదో స్థానంలో, ఇంగ్లండ్ జట్టు 40.79శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. పాకిస్థాన్ జట్టు 33.33 శాతం విజయాలతో ఏడో స్థానంలో ఉంది.

Also Read : AUS vs IND : ధ్రువ్ జురెల్ సూపర్ క్యాచ్.. కంగుతిన్న మిచెల్ స్టార్క్.. వీడియో వైరల్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (2023 -25) ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ నెలలో ఇంగ్లాండ్ వేదికగా జరుగుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో తలపడాంటే పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్లకే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్లు మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ఫైనల్ మ్యాచ్ సమయం నాటికి ఏ రెండు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశాన్ని దక్కించుకుంటాయో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం అంచనాల ప్రకారం.. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లలో రెండు జట్లు ఫైనల్ మ్యాచ్ లో తలపడే అవకాశం ఉంది. భారత్ జట్టు ఆస్ట్రేలియాతో ఇంకా నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడు టెస్టుల్లో విజయం సాధిస్తే.. ఏ జట్టు గెలుపోటములపై ఆధారపడకుండా ఫైనల్ మ్యాచ్ లో ఆడే అవకాశం ఉంటుంది.