AUS vs IND : ధ్రువ్ జురెల్ సూపర్ క్యాచ్.. కంగుతిన్న మిచెల్ స్టార్క్.. వీడియో వైరల్
ధ్రువ్ జురెల్ అద్భుత క్యాచ్ తో మిచెల్ స్టార్క్ ను పెవిలియన్ బాటపట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Dhruv jurel
IND vs AUS 1st Test: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. మూడో రోజు ఆటలో టీమిండియా ఆస్ట్రేలియా ఎదుట 534 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. మూడోరోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. నాల్గో రోజు (సోమవారం) ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఆస్ట్రేలియా వరుస వికెట్లు కోల్పోతూ వచ్చింది. ట్రావిస్ హెడ్ (89), మిచెల్ మార్ష్ (47) మినహా ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎవరూ పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు. ఈ క్రమంలో ధ్రువ్ జురెల్ అద్భుత క్యాచ్ తో మిచెల్ స్టార్క్ ను పెవిలియన్ బాటపట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆస్ట్రేలియా 227 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ (12) రూపంలో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ వేశాడు. క్రీజులో మిచెల్ స్టార్క్ ఉన్నాడు. సుందర్ లెంగ్త్ బాల్ వేయగా.. మిచెల్ స్టార్క్ బంతిని లెగ్ సైడ్ కి దూరంగా కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ, బాల్ స్టార్క్ బ్యాట్ అంచుభాగాన్ని తాకుతూ వెళ్లింది.. అక్కడే హెల్మెంట్ పెట్టుకొని ఫీల్డింగ్ లో ఉన్న ధ్రువ్ జురెల్ పైకిఎగిరి బాల్ ను వేగంగా అందుకున్నాడు. దీంతో మిచెల్ స్టార్క్ ఆశ్చర్యంగా చూస్తూ పెవిలియన్ వైపు నడుస్తూ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ధ్రువ్ సూపర్ క్యాచ్ అంటూ అభినందిస్తున్నారు.
INSANE STUFF FROM DHRUV JUREL – ONE OF THE BEST CATCHES. 🤯pic.twitter.com/vTZv3cMAr3
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 25, 2024