IPL Mega Auction 2025 : అరెరె.. కొద్దిలో మిస్సైందిగా.. బెంగళూరు వద్దంటే.. డుప్లెసిస్ ను ఎవరు తీసుకున్నారో తెలుసా?
న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిఫ్స్‌లను ఎవ్వరూ తీసుకోలేదు.

Faf du Plessis sold to Delhi Capitals
రెండో రోజు ఐపీఎల్ మెగా వేలం 2025 సౌదీఅరేబియాలోని జెడ్డా వేదికగా కొనసాగుతోంది. న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిఫ్స్‌లను ఎవ్వరూ తీసుకోలేదు. వెస్టిండీస్‌కు చెందిన రోమ్‌మన్ పావెల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.1.50 కోట్లకు తీసుకుంది. ఇక బెంగళూరు వేలానికి విడిచిపెట్టిన మాజీ కెప్టెన్ డుప్లెసిస్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్లకు దక్కించుకుంది.
40 ఏళ్ల డుప్లెసిస్.. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చాడు. అయితే.. అతడిని కొనేందుకు ఆరంభంలో ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. అయితే.. ఆఖరిలో ఢిల్లీ క్యాపిటల్స్ అదే ధర వద్ద అతడిని తీసుకుంది.
ఐపీఎల్ లో చాలా కాలం పాటు డుప్లెసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడాడు. గత మూడు సీజన్లుగా ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే.. అతడి నాయకత్వంలో బెంగళూరు కప్పును గెలవలేకపోయింది.
దీంతో అతడిని రీటైన్ చేసుకోవడానికి బెంగళూరు ఇష్టపడలేదు. వేలానికి విడిచిపెట్టింది. కనీసం వేలంలో సైతం అతడిని దక్కించుకునే ప్రయత్నం చేయలేదు.
Straight from the Highveld comes Mr. Fantastic, with his biceps and Sixes 💪 🙌 pic.twitter.com/9L32uOOg9W
— Delhi Capitals (@DelhiCapitals) November 25, 2024