Venkatesh Iyer
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో కోట్లాది రూపాయల ధరకు అమ్ముడుపోయి అందుకు న్యాయం చేయకపోతున్నాడు వెంకటేశ్ అయ్యర్. ఐపీఎల్‌లో అతడి పెర్ఫార్మన్స్ బాగోలేదు. దీంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. వచ్చే మ్యాచుల్లోనైనా సరిగ్గా ఆడి తనకు ఇస్తున్న డబ్బుకి న్యాయం చేయాలని ఫ్యాన్స్ అంటున్నారు.
వెంకటేశ్ అయ్యర్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లు ఉండగా ఈ సీజన్‌లో అతడు రూ.23.75 కోట్లకు అమ్ముడుపోయాడు. ఈ ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో క్రికెటర్ ఇతడు. రికార్డు స్థాయి ధరకు కేకేఆర్ అతడిని తీసుకున్నప్పటికీ అందుకు తగ్గట్టు ఆడలేకపోతున్నాడు.
Also Read: రూ.27 కోట్లు దండగ.. అంత ధరకు ఎల్‌ఎస్‌జీ కొంటే రిషబ్ ఇలా ఆడుతున్నాడేంటి?
సోమవారం మధ్యాహ్నం వరకు కేకేఆర్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో అతడు ఒక అర్ధ సెంచరీ బాది, మొత్తం 121 పరుగులు మాత్రమే చేశాడు. వెంకటేశ్ అయ్యర్ కంటే చాలా తక్కువ ధరకు అమ్ముడుపోయిన చాలా మంది బ్యాటర్లు ప్రస్తుత ఐపీఎల్‌లో ఇరగదీస్తున్నారు.
వెంకటేశ్ అయ్యర్ మాత్రం అంత ధరకు అమ్ముడుపోయినప్పటికీ అంచనాలకు తగ్గట్టు ఆడడం లేదని విమర్శలు వస్తున్నాయి. అసలు అతడిని అంత ధరకు ఎందుకు కొన్నారన్న సందేహాలనూ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.