IPL 2025: రూ.27 కోట్లు దండగ.. అంత ధరకు ఎల్‌ఎస్‌జీ కొంటే రిషబ్ ఇలా ఆడుతున్నాడేంటి?
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లు ఉండగా ఈ సీజన్‌లో రూ.27 కోట్ల ధరకు అమ్ముడుపోయాడు.

PIC: @BCCI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో కొందరు ప్లేయర్లు కోట్లాది రూపాయల ధర పలికారు. వారి పెర్ఫార్మన్స్ మాత్రం పేలవంగా ఉంది. దీంతో అన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారిని తీసుకోవడం దండగ అయిందంటూ విమర్శలు వస్తున్నాయి. అటువంటి ప్లేయరే రిషబ్ పంత్.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లు ఉండగా ఈ సీజన్‌లో రూ.27 కోట్ల ధరకు అమ్ముడుపోయాడు. ఐపీఎల్‌లో ఇది రికార్డు స్థాయి ధర. అంత ధరకు అతడిని లక్నో వేలంలో తీసుకున్నప్పటికీ అందుకు తగ్గట్టు ఆడలేకపోతున్నాడు.
ఇప్పటివరకు లక్నో 8 మ్యాచులు ఆడింది. ఆ మ్యాచుల్లో రిషబ్ పంత్ స్ట్రయిక్‌రేట్‌తో 98.15. ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. 8 మ్యాచుల్లో కలిపి అతడి రన్స్ మొత్తం 106 మాత్రమే.
ప్రస్తుత సీజన్‌లో సోమవారం మధ్యాహ్నం నాటికి ఎల్‌ఎస్‌జీ టీమ్ మొత్తం 8 మ్యాచులు ఆడి 5 మ్యాచుల్లో గెలిచి, మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. టాప్-5లో ఉన్న జట్ల అన్నింటి కంటే తక్కువ నెట్‌రన్‌రేట్ (+0.088) ఎల్‌ఎస్‌జీకి ఉంది. మిగతా మ్యాచుల్లో కూడా రిషబ్ పంత్ రాణించకపోతే మరిన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.