IPL 2025: రాజస్థాన్‌పై ఓటమి తరువాత మహేంద్రసింగ్ ధోనీ ఆసక్తికర కామెంట్స్.. యువ ప్లేయర్లకు కీలక సూచనలు

రాజస్థాన్ జట్టుపై మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ యువ ప్లేయర్లకు కీలక సూచనలు చేశారు.

IPL 2025

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ లో భాగంగా మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడ్డాయి. కొన్ని వారాలుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్న చెన్నై .. ఈ మ్యాచ్ లో గెలిచి రాజస్థాన్ ను వెనక్కి నెట్టాలని గట్టిగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది.

Also Read: IPL 2025: చెన్నైపై రాజస్తాన్ సూపర్ విజయం..

తొలుత చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టు 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ జట్టు ఓటమికి గల కారణాలను వెల్లడించారు. బ్యాటింగ్ లో వరుసగా వికెట్లు కోల్పోవడం, బౌలింగ్ లో పవర్ ప్లే లోనే ధారాళంగా పరుగులిచ్చుకోవటం తమ జట్టు ఓటమికి ప్రధాన కారణాలని ధోనీ పేర్కొన్నారు.

Also Read: Mumbai Indians : ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్ట‌క‌ముందే టైటిల్ కొట్టేందుకు ముంబై మాస్ట‌ర్ ప్లాన్‌.. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా ముగ్గురు..

‘వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల చివరిలో వేగంగా పరుగులు చేయలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోతే లోయరార్డర్ పై ఒత్తిడి పెరుగుతుంది. బ్రెవిస్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను రిస్కీ షాట్స్ ఆడాడు. మా రన్ రేట్ కూడా బాగానే ఉంది. కానీ, లోయరార్డర్ లో మేం కొంచెం మెరుగవ్వాలి. వరుసగా వికెట్లు కోల్పోవడం జట్టుకు నష్టం చేసింది. అన్షుల్ కంబోజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సీమ్ మూమెంట్ లేకపోవటంతో స్వింగ్ రాబట్టలేకపోయాడు. కానీ, అతను చాలా వేగంగా బౌలింగ్ చేశాడు.’’ అని ధోనీ అన్నారు.

యువ ప్లేయర్లకు ధోనీ కీలక సూచనలు చేశారు. ‘‘యువ ప్లేయర్లు నిలకడగా ఆడేందుకు ప్రయత్నించాలి. 200 స్ట్రైక్ రేట్ కోసం కాకుండా పరిస్థితులు తగ్గట్టు ఆడటం నేర్చుకోవాలి. ముఖ్యంగా బ్యాటర్లు తమను తాము నమ్ముకోవాలి. కుర్రాళ్లంతా తొలి సీజన్ ఎలా ఆడారో అదే జోరును కొనసాగించడం చాలా ముఖ్యం. నిలకడగా రాణించే ప్రయత్నం చేసినప్పుడే బ్యాటర్ గా మరింత ఎదగడానికి సహాయపడుతుందని ధోనీ యువ ప్లేయర్లకు సూచించాడు.’’