IPL 2025: చెన్నైపై రాజస్తాన్ సూపర్ విజయం..
ఫలితంగా 6 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.

Courtesy BCCI
IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. చెన్నైపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్ కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 188 పరుగుల టార్గెట్ ను ఆర్ఆర్ మరో 17 బంతులు ఉండగానే చేజ్ చేసింది. ఫలితంగా 6 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.
రాజస్థాన్ జట్టులో 14ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. చివరలో ధ్రువ్ జురెల్ 12 బంతుల్లో 31 పరుగులతో మెరుపు బ్యాటింగ్ చేశాడు. జైస్వాల్ 36 పరుగులతో రాణించాడు. చెన్నై బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీశాడు. కాంబోజ్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. రాజస్తాన్ తన అఖరి మ్యాచ్ ను విజయంతో ముగించింది.