Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. శనివారం పంజాబ్ కింగ్స్ పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మొత్తంగా 15 పాయింట్లతో ఐదో స్థానంతో సీజన్‌ను ముగించింది.
వాస్తవానికి అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 18వ సీజన్‌ను చాలా గొప్పగా ఆరంభించింది. ఆ జట్టు తొలి నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరుకున్న మొదటి జట్టుగా నిలుస్తుందని చాలా మంది భావించారు. అయితే.. ఆతరువాత వరుస ఓటములతో ఢిల్లీ సతమతమైంది. దీంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది.
Shreyas iyer : శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డు.. ధోని బచాయించాడు భయ్యా..
ఒక్కొ బంతికి రూ.60లక్షలు..
ఐపీఎల్ 2025 సీజన్ కోసం టి.నజరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అతడు తమ ప్రధాన బౌలర్ అవుతాడని భావించి అంత పెద్ద మొత్తం అతడి కోసం వెచ్చించింది. అయితే.. సీజన్ ఆరంభం అయ్యాక అతడికి తుది జట్టులో ఆడే ఛాన్స్ పెద్దగా రాలేదు. 14 మ్యాచ్‌లను ఈ సీజన్‌లో ఢిల్లీ ఆడగా.. కేవలం రెండు అంటే రెండే మ్యాచ్‌ల్లో నటరాజన్‌కు అవకాశం లభించింది.
ఈ రెండు మ్యాచ్‌ల్లో కూడా అతడు కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. 16 కంటే ఎక్కువ ఎకానమితో 49 పరుగులు ఇచ్చాడు. దీంతో ఢిల్లీ అతడిని పక్కన పెట్టింది. ఇక ఇప్పుడు సీజన్ పూర్తి కావడంతో నటరాజన్ కాస్ట్ లీ ప్లేయర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతడు 18 బంతులు మాత్రమే వేశాడు. అంటే ఒక్కొ బంతికి సుమారు రూ.60లక్షలు అందుకున్నాడు.