Shubman Gill : టీమ్ఇండియా టెస్టు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నికర ఆస్తి ఎంతో తెలుసా..? వామ్మో గట్టిగానే సంపాదించాడుగా!
టీమ్ఇండియా టెస్టు కొత్త కెప్టెన్ గిల్ క్రికెట్ ద్వారా భారీగానే సంపాదించాడు.

Shubman Gill Net Worth details here life style
భారత టెస్టు క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది. మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో భారత టెస్టు కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపిక అయ్యాడు. ఇంగ్లాండ్‌తో జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ సారథ్యంలోనే భారత్ బరిలోకి దిగనుంది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు, కొన్ని టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం గిల్‌కు ఉంది.
ఇదిలా ఉంటే.. గిల్ నికర ఆస్తుల విలువ, జీతం వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ ద్వారా గట్టిగానే..
ఐపీఎల్ ద్వారా గిల్ పెద్ద మొత్తంలో సంపాదించాడు. 2018లో గిల్ ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. తొలి సీజన్‌లోనే రూ.1.8 కోట్లు అందుకున్నాడు. మరో మూడు సీజన్ల పాటు అతడు ఇదే సాలరీని అందుకున్నాడు. ఆ తరువాత 2022లో అతడిని గుజరాత్ టైటాన్స్ రూ.8కోట్లకు సొంతం చేసుకుంది. 2023, 2024 సీజన్లలోనూ అతడు అదే మొత్తాన్ని పొందాడు. ఇక ఐపీఎల్ 2025లో అతడి జీతం రూ.16.5 కోట్లు.
బీసీసీఐ నుంచి ఎంతంటే..
గతేడాది వరకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో బ్రీ గేడ్‌లో ఉండగా రూ.3కోట్లు జీతంగా పొందాడు. ఈ సారి అతడికి ప్రమోషన్ లభించింది. ఏ గ్రేడ్‌లో బీసీసీఐ చేర్చింది. దీంతో అతడు సంవత్సరానికి రూ.5 కోట్లు అందుకోనున్నాడు. ఇది కాకుండా మ్యాచ్ ఫీజుల కింద భారీగానే అందుకోనున్నాడు. ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ.15లక్షలు, ఒక్కొ వన్డేకు రూ.6లక్షలు, ఒక్కొ టీ20 మ్యాచ్‌కు రూ.3లక్షల చొప్పున పొందుతాడు.
వాణిజ్య ప్రకటనలు..
గిల్ అనేక ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వీటిలో నైక్, జేబీఎల్, క్యాసియో, సియట్, టాటా క్యాపిటల్, జిల్లెట్, గేమ్స్24×7, డానోన్, మై11సర్కిల్, భారత్‌పే వంటివి ఉన్నాయి. ఈ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా గిల్ పెద్ద మొత్తంలోనే ఆర్జిస్తున్నాడు.
విలాసవంతమైన ఇల్లు, కార్లు..
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో గిల్‌కు సుమారు రూ. 3.2 కోట్ల విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉంది. అతని వద్ద ఖరీదైన కార్ల కలెక్షన్ కూడా ఉంది. ఇందులో రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ E350, ఆనంద్ మహీంద్రా బహుమతిగా ఇచ్చిన మహీంద్రా థార్ వంటివి ఉన్నాయి.
నికర ఆస్తి..
పలు నివేదికల ప్రకారం 2025 నాటికి శుభ్‌మాన్ గిల్ నికర విలువ రూ.32 నుండి రూ.50 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.