IPL 2025 : పంజాబ్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఢిల్లీ.. సమీర్ సూపర్ బ్యాటింగ్..

మరో 3 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ని ఫినిష్ చేసింది.

Courtesy BCCI

IPL 2025: కీలక మ్యాచ్ లో గెలిచి పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ కు వెళ్లాలని అనుకున్న పంజాబ్ కింగ్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పంజాబ్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపింది. ఉత్కంఠపోరులో పంజాబ్ పై సంచలన విజయం నమోదు చేసింది. 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ చేజ్ చేసింది. మరో 3 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ని ఫినిష్ చేసింది. 6 వికెట్ల తేడాతో పంజాబ్ ను చిత్తు చేసింది డీసీ.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో సమీర్ రిజ్వీ సంచలన బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. 25 బంతుల్లోనే 58 పరుగులు బాదాడు. ఏకంగా 5 సిక్సులు కొట్టాడు. నాటౌట్ గా నిలిచి ఢిల్లీకి సంచలన విజయాన్ని అందించాడు. కేఎల్ రాహుల్(35), డుప్లెసిస్(23), కరుణ్ నాయర్(44), ట్రిస్టన్ స్టబ్స్(18 నాటౌట్) రాణించారు.

Also Read: ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా గిల్‌.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ష‌మీల‌కు నో ప్లేస్‌