ENG vs IND : ఇంగ్లాండ్ పర్యటనకు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా గిల్.. శ్రేయస్ అయ్యర్, షమీలకు నో ప్లేస్
ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

BCCI Announced team India test Squad For England
ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అతడి స్థానంలో శుభ్‌మన్ గిల్ కు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. వెస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేసింది.
Say Hello to #TeamIndia‘s newest Test Captain 👋@ShubmanGill pic.twitter.com/OkBmNZT5M0
— BCCI (@BCCI) May 24, 2025
దేశవాలీతో పాటు ఐపీఎల్‌లో అదరగొడుతున్న కరుణ్ నాయర్ ఇంగ్లాండ్‌తో సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. యువ ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్‌లకు జట్టులో చోటు దక్కింది.
నలుగురు ఆల్‌రౌండర్లు.. నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేసింది. ఒకే ఒక స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు చోటు ఇచ్చింది. పేస్ విభాగ బాధ్యతలను జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్ దీప్ సింగ్‌లు మోయనున్నారు. సీనియర్ ఆటగాడు మహ్మద్ షమీ, మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌లకు మరోసారి నిరాశే ఎదురైంది.
Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪
A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq
— BCCI (@BCCI) May 24, 2025
Punjab Kings : సన్‌రైజర్స్ చేతిలో ఆర్‌సీబీ ఓటమి.. పంజాబ్ సుడి మామూలుగా తిరగలేదు భయ్యా..
ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్‌కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టెస్టు – జూన్ 20 నుంచి జూన్ 24 వరకు – హెడింగ్లీ
రెండో టెస్టు – జూలై 2 నుంచి జూలై 6 వరకు – ఎడ్జ్‌బాస్టన్
మూడో టెస్టు – జూలై 10 నుంచి జూలై 14 వరకు – లార్డ్స్
నాలుగో టెస్టు – జూలై 24 నుంచి జూలై 27 వరకు – ఓల్డ్ ట్రాఫోర్డ్
ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు – కెన్నింగ్టన్ ఓవల్