Punjab Kings : సన్‌రైజర్స్ చేతిలో ఆర్‌సీబీ ఓటమి.. పంజాబ్ సుడి మామూలుగా తిరగలేదు భయ్యా..
పంజాబ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. ఒక్క మ్యాచ్ ఆడకుండానే భారీ ప్రయోజనం పొందింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శుక్రవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓడిపోవడంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాన్ని కోల్పోయింది. అదే సమయంలో పంజాబ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. ఒక్క మ్యాచ్ ఆడకుండానే భారీ ప్రయోజనం పొందింది.
ఆర్‌సీబీ ఓడిపోవడంతో పంజాబ్ జట్టు మ్యాచ్ ఆడకుండానే మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. ఇక పంజాబ్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో గెలిస్తే 19 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం గుజరాత్ జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
RCB : ఆర్‌సీబీకి లక్నో ‘టెన్షన్’.. కోహ్లీ ఆశ నెరవేరేనా?
పంజాబ్‌కు గోల్డెన్ ఛాన్స్..
ఆర్‌సీబీ ఓటమితో లీగ్ దశ ముగిసే నాటికి పంజాబ్ టాప్-2లో నిలిచేందుకు సువర్ణావకాశం లభించింది. ఢిల్లీతో పాటు ముంబై (మే 26న) పైన పంజాబ్ విజయం సాధిస్తే అప్పుడు 21 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
అలా కాకుండా ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కూడా ఆ జట్టు టాప్-2లో నిలవొచ్చు. ఎలాగంటే.. గుజరాత్ లేదా ఆర్‌సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోతే పంజాబ్ టాప్-2లో నిలుస్తుంది.
మొత్తంగా సన్‌రైజర్స్ జట్టు ఆర్‌సీబీ చేతిలో ఓడిపోవడం పంజాబ్‌కు బాగా కలిసి వచ్చింది.