RCB vs SRH : సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ కంటే ఆర్‌సీబీ లీడర్ రజత్ పాటిదార్‌కు భారీ జరిమానా.. ఎందుకో తెలుసా?
గెలుపు జోష్‌లో ఉన్న సన్‌రైజర్స్‌కు, ఓటమి బాధలో ఉన్న ఆర్‌సీబీలకు బీసీసీఐ షాక్ ఇచ్చింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియంలో శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ పై సన్‌రైజర్స్ విజయం సాధించింది. అయితే.. గెలుపు జోష్‌లో ఉన్న సన్‌రైజర్స్‌కు, ఓటమి బాధలో ఉన్న ఆర్‌సీబీలకు బీసీసీఐ షాక్ ఇచ్చింది.
సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్‌తో పాటు ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌లకు భారీ జరిమానాలను విధించింది. మ్యాచ్‌లో ఇరు జట్లు స్లో ఓవర్ రేటు ను నమోదు చేయడమే ఇందుకు కారణం.
Punjab Kings : సన్‌రైజర్స్ చేతిలో ఆర్‌సీబీ ఓటమి.. పంజాబ్ సుడి మామూలుగా తిరగలేదు భయ్యా..
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. సన్‌రైజర్స్ జట్టు ఈ సీజన్‌లో తొలిసారి స్లో ఓవర్ రేటు నమోదు చేయడంతో ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్‌కు రూ.12లక్షల జరిమానా విధించారు. అదే సమయంలో ఆర్‌సీబీ జట్టు ఈ సీజన్‌లో స్లో ఓవర్‌ను నమోదు చేయడం ఇది రెండో సారి. దీంతో ఆ జట్టు కెప్టెన్ అయిన రజత్ పాటిదార్‌కు రూ.24లక్షల జరిమానాను ఐపీఎల్ పాలక మండలి విధించింది.
అంతేకాదండోయ్ ఆర్‌సీబీ జట్టులోని ఆటగాళ్లకు ఫైన్ వేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని ఆటగాళ్లు ఒక్కొక్కరికి రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం రెండింటిలో ఏది తక్కువ అయితే అది జరిమానాగా విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.