Courtesy BCCI
IPL 2025 : ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ గెలుపొందింది. 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ ను చిత్తు చేసింది కోల్ కతా. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
అనంతరం బరిలోకి దిగిన కోల్ కతా జట్టు 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. మరో 15 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది. డికాక్ దంచికొట్టాడు. 61 బంతుల్లో 97 పరుగులు చేశాడు. రఘువంశీ (22), రహానె (18) పరుగులు చేశారు. ఈ సీజన్ లో కేకేఆర్ కు ఇది తొలి విజయం కాగా ఆర్ఆర్ కు రెండో ఓటమి.