IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్.. టోర్నీ నుంచి కీలక ప్లేయర్ ఔట్

ఐపీఎల్-2025 టోర్నీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే, టోర్నీ ప్రారంభానికి ముందే కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది.

KKR Team

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2025) టోర్నీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య జరగనుంది. టోర్నీలో మొత్తం పది జట్లు పోటీ పడుతున్నాయి. అయితే, ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టులోని కీలక ప్లేయర్ టోర్నీకి దూరమయ్యాడు.

Also Read: Vraun Chakravarthy: టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎప్పటికీ టెస్ట్ క్రికెట్ ఆడలేడా..? ఎందుకో తెలుసా..

కొన్నేళ్ల ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున సత్తాచాటి, ఈ సీజన్ కు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోకి ఎంపికైన జమ్ముకశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ గాయంతో లీగ్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ చేతన్ సకారియాను కేకేఆర్ జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యం స్వయంగా ప్రకటించింది.

Also Read: IPL 2025: ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు వెళ్తున్నారా.. అయితే, మీకు గుడ్‌న్యూస్‌.. ఉచిత ప్రయాణం.. కానీ, ఓ షరతు..

చేతన్ సకారియా భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అతను ఒక వన్డే, రెండు టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను ఐపీఎల్ లో ఇప్పటి వరకు 19 మ్యాచ్ లలో 20 వికెట్లు పడగొట్టాడు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ చేతన్ సకారియాను రూ.75లక్షలకు కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. అయితే, తొలుత ఐపీఎల్-2025 వేలంలో చేతన్ ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. కేకేఆర్ జట్టులో నెట్ బౌలర్ గా చేరాడు. ఇప్పుడు ఇమ్రాన్ మాలిక్ స్థానంలో కేకేఆర్ అతనిని జట్టులోకి తీసుకుంది.

 

కేకేఆర్ తుది జట్టు అంచనా..
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), అజింక్య రహానే, వెంకటేశ్ అయ్యర్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రింకు సింగ్, రమణ్‌దీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్ట్జే/స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి.