IPL 2025: ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు వెళ్తున్నారా.. అయితే, మీకు గుడ్‌న్యూస్‌.. ఉచిత ప్రయాణం.. కానీ, ఓ షరతు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) సందడి షురూ అయింది. ఈనెల 22 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది.

IPL 2025: ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు వెళ్తున్నారా.. అయితే, మీకు గుడ్‌న్యూస్‌.. ఉచిత ప్రయాణం.. కానీ, ఓ షరతు..

IPL 2025

Updated On : March 16, 2025 / 12:29 PM IST

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) సందడి షురూ అయింది. ఈనెల 22 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే  కొన్ని మ్యాచ్ లకు సంబంధించి టికెట్ల బుకింగ్ సైతం పూర్తయింది. ఈ క్రమంలో మైదానంలో మ్యాచ్ ను చూసేందుకు వెళ్లేవారికి సీఎస్కే జట్టు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది.

Also Read: WPL 2025: డబ్ల్యూపీఎల్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన, వికెట్లు తీసిన.. సిక్సులు కొట్టిన ప్లేయర్లు వీరే..

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు మైదానంకు వెళ్లేవారికోసం చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లను తిలకించేందుకు వెళ్లేవారు.. వారు ఉంటున్న ప్రాంతానికి సమీపంలోని మెట్రో స్టేషన్ నుంచి గవర్నమెంట్ ఎస్టేట్ స్టేషన్ వరకు రానూపోను మెట్రో రైలు సేవలు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అయితే, తప్పనిసరిగా ఐపీఎల్ మ్యాచ్ టికెట్ కలిగి ఉండాలి. ఈ మేరకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యాజమాన్యంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Also Read: WPL 2025: ఉత్కంఠభరిత పోరులో మూడోసారీ ఢిల్లీకి నిరాశే.. డబ్ల్యూపీఎల్-2025 ఛాంపియ‌న్‌గా ముంబై ఇండియన్స్‌

మ్యాచ్ జరిగేరోజు ఆ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ తో మెట్రోలో ఎంఏ చిదంబరం స్టేడియంకు వెళ్లొచ్చు. మ్యాచ్ ముగిసిన తరువాత 90 నిమిషాలు లేదా అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. సీఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. క్రికెట్ అభిమానులు మ్యాచ్ ప్రారంభం కావడానికి మూడు గంటల ముందుగా నాన్ ఏసీ ఎంటీసీ (మెట్రోపాలిటన్ ట్రాన్స్ ఫోర్ట్ కార్పొరేషన్) బస్సుల్లో తమ వద్ద ఉన్న క్రికెట్ మ్యాచ్ టికెట్ తో ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని తెలిపారు. ఈ మేరకు చెన్నై చేపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్ కు ఎంటీసీ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

 

ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్ లు ..
23న సీఎస్కే – ముంబయి ఇండియన్స్ (రాత్రి 7.30)
28న సీఎస్కే- ఆర్సీబీ (రాత్రి 7.30)
ఏప్రిల్ 5న సీఎస్కే- డీసీ (మధ్యాహ్నం 3.30),
ఏప్రిల్ 11న సీఎస్కే-కేకేఆర్ (రాత్రి 7.30).
ఏప్రిల్ 25న సీఎస్కే – ఎస్ఆర్‌హెచ్‌ (రాత్రి 7.30).
ఏప్రిల్ 30న సీఎస్కే- పీబీకేఎస్ (రాత్రి 7.30).
మే12న సీఎస్కే -ఆర్ఆర్ (రాత్రి 7.30)