WPL 2025: డబ్ల్యూపీఎల్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన, వికెట్లు తీసిన.. సిక్సులు కొట్టిన ప్లేయర్లు వీరే..

డబ్ల్యూపీఎల్ టోర్నీ ఛాంపియన్స్ గా ముంబై ఇండియన్స్ రెండోసారి నిలిచింది.

WPL 2025: డబ్ల్యూపీఎల్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన, వికెట్లు తీసిన.. సిక్సులు కొట్టిన ప్లేయర్లు వీరే..

Womens Premier League 2025

Updated On : March 16, 2025 / 11:02 AM IST

Womens Premier League 2025: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 టోర్నీలో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. శనివారం ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠతగా సాగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read: WPL 2025: ఉత్కంఠభరిత పోరులో మూడోసారీ ఢిల్లీకి నిరాశే.. డబ్ల్యూపీఎల్-2025 ఛాంపియ‌న్‌గా ముంబై ఇండియన్స్‌

డబ్ల్యూపీఎల్ టోర్నీ ఛాంపియన్స్ గా ముంబై ఇండియన్స్ రెండోసారి నిలిచింది. 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ విజయం సాధించగా.. 2024 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించి టోర్నీ విజేతగా నిలిచింది. తాజాగా.. 2025 టోర్నీ ఫైనల్స్ లో మరోసారి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడగా.. మళ్లీ ముంబై ఇండియన్స్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. తద్వారా రెండోసారి డబ్ల్యూపీఎల్ టోర్నీ ఛాంపియన్స్ గా నిలిచింది. అయితే, మూడు సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్ గానే నిలవడం విశేషం.

Also Read: Ishan Kishan : స‌న్‌రైజ‌ర్స్‌ హైద‌రాబాద్‌కు త‌ల‌నొప్పిగా మారిన ఇషాన్ కిష‌న్‌? బ‌లం అవుతాడునుకుంటే ?

డబ్ల్యూపీఎల్ 2025లో అత్యధిక పరుగులు..
నాట్ స్కివర్-బ్రంట్ (MI) : 10 మ్యాచ్‌లలో 523 పరుగులు.
ఎల్లీస్ పెర్రీ (MI): 8 మ్యాచ్‌ల్లో 372 పరుగులు.
హేలీ మాథ్యూస్ (MI): 10 మ్యాచ్‌ల్లో 307 పరుగులు.
షఫాలీ వర్మ (DC): 9 మ్యాచ్‌ల్లో 304 పరుగులు.
హర్మన్‌ప్రీత్ కౌర్ (MI): 10 మ్యాచ్‌ల్లో 302 పరుగులు

అత్యధిక వికెట్లు ..
అమేలియా కెర్ (MI): 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు.
హేలీ మాథ్యూస్ (MI): 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు.
జెస్ జోనాస్సెన్ (DC): 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు.
నాట్ స్కైవర్-బ్రంట్ (MI): 10 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు.
జార్జియా వేర్‌హామ్ (RCB): 8 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు.

అత్యధిక అర్ధ సెంచరీలు..
నాట్ స్కైవర్-బ్రంట్ (MI): 5
ఎల్లీస్ పెర్రీ (ఆర్‌సిబి): 4
హేలీ మాథ్యూస్ (MI): 3
హర్మన్‌ప్రీత్ కౌర్ (MI): 3
మెగ్ లానింగ్ (DC): 3

అత్యధిక సిక్సర్లు..
ఆష్లీ గార్డనర్ (జిజి): 9 మ్యాచ్‌ల్లో 18 సిక్సర్లు.
షఫాలీ వర్మ (DC): 9 మ్యాచ్‌ల్లో 16 సిక్సులు.
చినెల్లే హెన్రీ (GG): 7 మ్యాచ్‌ల్లో 15 సిక్సులు.
రిచా ఘోష్ (ఆర్‌సిబి): 8 మ్యాచ్‌ల్లో 13 సిక్సులు.
ఎల్లీస్ పెర్రీ (ఆర్‌సిబి): 8 మ్యాచ్‌ల్లో 11 సిక్సర్లు.

అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు..
అమేలియా కెర్ (MI): 4 ఓవర్లలో 5/38 vs UP వారియర్జ్ మహిళలు.
గ్రేస్ హారిస్ (UPW): ఢిల్లీ క్యాపిటల్స్ మహిళలపై 2.3 ఓవర్లలో 4/15.
క్రాంతి గౌడ్ (UPW): ఢిల్లీ క్యాపిటల్స్ మహిళలపై 4 ఓవర్లలో 4/25.
జెస్ జోనాస్సెన్ (DC): 4 ఓవర్లలో 4/31 vs UP వారియర్జ్ ఉమెన్ ఉమెన్.
కాశ్వీ గౌతమ్ (IND): 3 ఓవర్లలో 3/11 vs UP వారియర్జ్ మహిళలు

అత్యధిక క్యాచ్‌లు ..
ఎల్లీస్ పెర్రీ (ఆర్‌సిబి): 8 మ్యాచ్‌ల్లో 7 క్యాచ్‌లు.
మెగ్ లానింగ్ (DC): 9 మ్యాచ్‌ల్లో 7 క్యాచ్‌లు.
జెమిమా రోడ్రిగ్స్ (DC): 9 మ్యాచ్‌ల్లో 7 క్యాచ్‌లు.
షబ్నిమ్ ఇస్మాయిల్ (MI): 10 మ్యాచ్‌ల్లో 7 క్యాచ్‌లు.
అమేలియా కెర్ (MI): 10 మ్యాచ్‌ల్లో 7 క్యాచ్‌లు.