IPL 2025 : ఉత్కంఠపోరులో లక్నో విజయం.. పోరాడి ఓడిన కేకేఆర్

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Courtesy BCCI

IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ 18లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో విజయం లక్నోని వరించింది. కేకేఆర్ పోరాడి ఓడింది. కేవలం 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 239 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కేకేఆర్ బ్యాటర్లు ఆఖరి వరకు పోరాటం చేశారు. ఆఖరి ఓవర్ లో 24 పరుగులు చేయాల్సి ఉండగా రింకూ సింగ్ 14 రన్స్ చేసినా ప్రయోజనం లేకపోయింది.

Also Read : సీఎస్‌కే వ‌రుస ఓట‌ములు.. ధోని, ఫ్లెమింగ్‌ల‌కు ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక లేదు..

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. 239 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 234 పరుగులే చేసింది. దీంతో లక్నో జట్టు 4 పరుగుల తేడాతో గెలుపొందింది. కేకేఆర్ లో రహానె (61), వెంకటేశ్ అయ్యర్(45) రాణించారు. చివరలో రింకూ సింగ్ పోరాడినా ఫలితం లేకపోయింది. లక్నో బౌలర్లలో ఆకాశ్, శార్దూల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఈ సీజన్ లో లక్నోకి ఇది నాలుగో విజయం. మొత్తం 6 మ్యాచులు ఆడింది. రెండింటిలో ఓడింది. పాయింట్ల పట్టిలో 4వ స్థానంలో ఉంది. ఇక కేకేఆర్ కు ఈ సీజన్ లో ఇది మూడో ఓటమి. ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడగా రెండింటిలో మాత్రమే గెలిచింది. పాయింట్ల టేబుల్ లో 6వ స్థానంలో ఉంది.