Rishabh Pant : కోట్లు కొల్ల‌గొట్టిన పంత్.. అయ్య‌ర్ రికార్డు బ్రేక్‌.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర

ఐపీఎల్ మెగా వేలం 2025లో టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ చ‌రిత్ర సృష్టించాడు.

IPL 2025 Mega Auction Rishabh Pant sold to Gujarat Titans

ఐపీఎల్ మెగా వేలం 2025లో టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. రూ.27 కోట్ల‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పంత్ ను సొంతం చేసుకుంది. ఈ వేలంలోనే శ్రేయాస్ అయ్య‌ర్ రూ.26.7 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కాసేప‌ట్లోనే ఈ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.

రూ.2 కోట్ల క‌నీస ధ‌ర‌కు అత‌డు పంత్ వేలంలోకి వ‌చ్చాడు. అత‌డి కోసం మొదట స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాబ్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు పోటీప‌డ్డాయి. రూ.20 కోట్ల వ‌ర‌కు ఇరు జ‌ట్లు హోరాహోరీగా పాడాయి. అయితే.. ఒక్క‌సారి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అమాంతం రూ.7 కోట్ల‌కు పెంచి రూ.27 కోట్ల‌కు సొంతం చేసుకుంది.

IPL Auction 2025 : రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధికం..