IPL Auction 2025 : రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధికం..

టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయాడు.

IPL Auction 2025 : రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధికం..

Updated On : November 24, 2024 / 4:32 PM IST

ఐపీఎల్ వేలం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఆట‌గాళ్లను ద‌క్కించుకునేందుకు ప్రాంఛైజీలు హోరాహోరీగా పోటీ ప‌డుతున్నాయి. ఇక టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయాడు. రూ.26.5 కోట్ల‌కు అత‌డిని పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.

రూ.2 కోట్ల క‌నీస ధ‌ర‌తో వేలంలోకి వ‌చ్చాడు శ్రేయ‌స్ అయ్య‌ర్‌. అత‌డి కోసం తొలుత కోల్‌క‌తా, ఢిల్లీ జ‌ట్లు పోటీప‌డ్డాయి. ఆ త‌రువాత పంజాబ్ రేసులోకి వ‌చ్చింది. ఆఖ‌రి వ‌ర‌కు ఢిల్లీ, పంజాబ్ నువ్వా నేనా అన్న‌ట్లుగా పోటీప‌డ్డాయి. ఈ క్ర‌మంలో రికార్డు ధ‌ర‌కు పంజాబ్ అత‌డిని సొంతం చేసుకుంది.

IPL Auction 2025 : ఐపీఎల్ మెగా వేలం.. తొలి ప్లేయ‌ర్‌గా అర్ష్‌దీప్ సింగ్.. రూ.18 కోట్లకు పంజాబ్ సొంతం

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు ఆసీస్ ఆట‌గాడు మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. ఐపీఎల్ 2024 మినీ వేలంలో అత‌డిని కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ 24.75 కోట్ల‌కు సొంతం చేసుకుంది.