IPL Auction 2025 : ఐపీఎల్ మెగా వేలం.. తొలి ప్లేయ‌ర్‌గా అర్ష్‌దీప్ సింగ్.. రూ.18 కోట్లకు పంజాబ్ సొంతం

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం మొద‌లైంది.

IPL Auction 2025 : ఐపీఎల్ మెగా వేలం.. తొలి ప్లేయ‌ర్‌గా అర్ష్‌దీప్ సింగ్.. రూ.18 కోట్లకు పంజాబ్ సొంతం

Arshdeep Singh

Updated On : November 24, 2024 / 4:07 PM IST

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం మొద‌లైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదిక‌గా ప్రారంభ‌మైంది. ఆక్ష‌న్‌లో మొద‌టి ప్లేయ‌ర్‌గా భార‌త ఆట‌గాడు అర్ష్‌దీప్ సింగ్ పేరు వ‌చ్చింది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో అత‌డు వేలంలోకి వ‌చ్చాడు. మొద‌ట్లో అత‌డి కోసం చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ పోటీ ప‌డ్డాయి.

మ‌ధ్య‌లో గుజరాత్ టైటాన్స్‌, రాజ‌స్థాన్ లు బిడ్ వేశాయి. ఆ త‌రువాత స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, పంజాబ్ కింగ్స్‌ పోటీ ప‌డ్డాయి. ఆఖ‌రికి అత‌డిని ఆర్‌టీఎమ్ కార్డును ఉప‌యోగించి పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్ల‌కు ద‌క్కించుకుంది.

IND vs AUS : ముగిసిన మూడో రోజు ఆట‌.. తొలి టెస్టులో విజ‌యం దిశ‌గా భార‌త్‌.. ఇంకో ఏడు వికెట్లు..

క‌గిసో ర‌బాడ సైతం..
ద‌క్షిణాఫ్రికా ఫాస్ట్ బౌల‌ర్ క‌గిసో రబాడ ను సైతం పంజాబ్ కింగ్స్ ద‌క్కించుకుంది. అత‌డి కోసం ఆర్‌సీబీ, గుజ‌రాత్‌, ముంబైలు పోటీ ప‌డ‌గా ఆఖ‌రి పంజాబ్ కింగ్స్ 10.75 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్ ద‌క్కించుకుంది.