IPL 2025: ఆర్సీబీని వీడటంపై మహమ్మద్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. విరాట్ గురించి ఏమన్నాడంటే..

ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీని వీడటంపైనా, విరాట్ కోహ్లీ గురించి మహమ్మద్ సిరాజ్ కీలక విషయాలను వెల్లడించారు.

Mohammed Siraj Virat Kohli

IPL 2025 Mohammed Siraj: ఐపీఎల్ సందడి షురూ అయింది. శనివారం సాయంత్రం తొలి మ్యాచ్ జరగనుంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్, హైదరాబాద్ వాసి మహమ్మద్ సిరాజ్ ఈసారి గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహించనున్న సంగతి తెలిసిందే. శుభ్ మన్ గిల్ సారథ్యంలో గుజరాత్ జట్టు తరపున సిరాజ్ మైదానంలోకి దిగనున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఆర్సీబీని వీడటంపైనా, విరాట్ కోహ్లీ గురించి కీలక విషయాలను వెల్లడించారు.

Also Read: IPL 2025: రోహిత్ శర్మతో ఓపెనర్ గా వచ్చేది ఎవరు..? మీడియా ప్రశ్నకు హార్దిక్ పాండ్యా కీలక కామెంట్స్.. మా జట్టులో ముగ్గురు కెప్టెన్లు..

మహమ్మద్ సిరాజ్ గత కొన్నాళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు. గత ఏడు సీజన్ల పాటు ఆర్సీబీకి ఆడిన సిరాజ్ కు మాజీ సారథి విరాట్ కోహ్లీతో మంచి అనుబంధం ఉంది. కోహ్లీ సూచనలతో అతను ఎన్నో వికెట్లు పడగొట్టాడు. అయితే, ఆర్సీబీ యాజమాన్యం సిరాజ్ ను రిటైన్ చేసుకోలేదు. ఆర్టీఎం కార్డు ఉపయోగించి తిరిగి జట్టులోకి కూడా తీసుకోలేదు. దీంతో మెగా వేలంలో సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.12.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఐపీఎల్ లో గుజరాత్ తరపున సిరాజ్ మైదానంలోకి దిగనున్నాడు.

Also Read: BCCI: రోహిత్ సేనకు గుడ్ న్యూస్.. భారీ క్యాష్ రివార్డు ప్రకటించిన బీసీసీఐ.. ఎంతంటే? క్రికెటర్లతోపాటు వారికి కూడా

ఆర్సీబీని వీడటంపై సిరాజ్ మాట్లాడుతూ.. రాయల్ ఛాలెంజర్స్ జట్టును వీడటం కొంత భావోద్వేగానికి గురిచేసిందని అన్నాడు. విరాట్ కోహ్లీ నా కెరీర్ లో కీలక పాత్ర పోషించాడు. 2018-19లో నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతను నాకు చాలా మద్దతు ఇవ్వడమేకాకుండా.. ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచాడని సిరాజ్ చెప్పుకొచ్చాడు. అయితే, కొత్త సీజన్ ముందు గుజరాత్ టైటాన్స్ లో చేరడం మంచి అనుభూతిని కలిగిస్తోందని అన్నారు. శుభ్ మన్ గిల్ సారథ్యంలో మాకు ఇక్కడ అద్భుతమైన జట్టు ఉందని పేర్కొన్నాడు.