IPL 2025: చెలరేగిన ముంబై.. గుజరాత్ ముందు బిగ్ టార్గెట్..

ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. 50 బంతుల్లో 81 పరుగులు చేసి..

Courtesy BCCI @IPL

IPL 2025: ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చెలరేగిపోయింది. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది ఎంఐ.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని బ్యాటర్లు వమ్ము చేయలేదు. ముంబై బ్యాట్స్ మెన్ దంచి కొట్టారు. జీటీ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. 50 బంతుల్లో 81 పరుగులు చేసి ఔటయ్యాడు. 9 ఫోర్లు, 4 సిక్సులు కొట్టాడు. జానీ బెయిర్ స్టో ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 22 బంతుల్లో 47 రన్స్ చేశాడు.

సూర్యకుమార్ యాదవ్ 20 బంతుల్లో 33 పరుగులు, తిలక్ వర్మ 11 బంతుల్లో 25 పరుగులు చేశారు. చివరలో కెప్టెన్ హార్దిక్ పాండ్య మెరుపు బ్యాటింగ్ చేశాడు. 9 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 2 వికెట్లు తీశారు. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.

Also Read: ఐపీఎల్ 2025 ఫైన‌ల్‌కు ముందు ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు కొత్త టెన్ష‌న్‌.. మ‌రోసారి అదే జ‌రిగితే క‌ప్పు గోవిందా?