PBKS vs LSG: రిషబ్ పంత్ ఈసారి బాల్, బ్యాట్ రెండూ గాల్లోకి లేపాడు.. సంజీవ్ గోయెంకా రియాక్షన్ వైరల్

లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పరుగులు రాబట్టడంలో మళ్లీ విఫలమయ్యాడు.

Credit BCCI

IPL 2025 PBKS vs LSG: ఐపీఎల్ -18 సీజన్ లో భాగంగా ఆదివారం రాత్రి పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఐదు వికెట్లకు 236 పరుగులు చేయగా.. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో జట్టు.. నిర్ణీత ఓవర్లలో కేవలం 199 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. అయితే, లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పరుగులు రాబట్టడంలో మళ్లీ విఫలమయ్యాడు.

Also Read: IPL 2025: ఉత్కంఠపోరులో చెన్నై ఓటమి.. మహేంద్ర సింగ్ ధోనీ కీలక కామెంట్స్.. అతను బాల్ ఎలావేసినా సిక్సులు కొట్టాడంటూ..

ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పేవల ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పరుగులు రాబట్టడంలో వరుసగా విఫలమవుతున్నాడు. ఒక్క హాఫ్ సెంచరీ మినహాయిస్తే ఈ సీజన్ లో పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ప్లేఆఫ్స్ కు వెళ్లాలంటే అత్యంత కీలకంగా మారిన మ్యాచ్ లో మరోసారి పంత్ వైఫల్యం కొనసాగింది. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో క్రీజులో ఉన్నంత వరకు పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన పంత్ ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమించాడు.

Also Read: IPL 2025: సీఎస్‌కేను దారుణంగా దెబ్బకొట్టిన రొమారియో షెపర్డ్.. చివరి రెండు ఓవర్లలో విధ్వంసం.. ఎంఎస్ ధోనీ ఏమన్నాడంటే..?

పంజాబ్ కింగ్స్ బౌలర్ ఒమర్ జాయ్ వేసిన 8వ ఓవర్లో ఐదో బంతిని పంత్ ముందుకొచ్చి భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను బ్యాట్ పట్టును కోల్పోయాడు. బ్యాట్ తో పాటు బాల్ సైతం గాల్లోకి లేచాయి. బౌండరీ లైన్ వద్ద శశాంక్ సింగ్ క్యాచ్ అందుకోవటంతో పంత్ పెవిలియన్ బాటపట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ యాజమాని సంజీవ్ గోయెంకా నిరుత్సాహంగా కనిపించాడు. ఇప్పటి వరకు లక్నో జట్టు 11 మ్యాచ్ లు ఆడగా.. ఐదు మ్యాచ్ లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 10పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టుపై ఓటమితో ప్లే ఆఫ్స్ ఆశలను ఆ జట్టు క్లిష్టతరం చేసుకుంది.