IPL 2025: ఉత్కంఠపోరులో చెన్నై ఓటమి.. మహేంద్ర సింగ్ ధోనీ కీలక కామెంట్స్.. అతను బాల్ ఎలావేసినా సిక్సులు కొట్టాడంటూ..
ఆర్సీబీ జట్టుపై రెండు పరుగుల తేడాతో ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Credit BCCI
IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
తొలుత ఆర్సీబీ బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్లు జాకబ్ బెతెల్ (55), విరాట్ కోహ్లీ (62) రాణించారు. చివరిలో రొమారియో షెఫర్డ్ (53నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడటంతో ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన సీఎస్కే జట్టుకు మంచి ఆరంభమే లభిచింది. ఆయుష్ (94), జడేజా (77నాటౌట్) రాణించారు. కానీ, చివరి ఓవర్లో సీఎస్కే బ్యాటర్లు లక్ష్యాన్ని చేరుకోలేక పోయారు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి సీఎస్కే జట్టు 211 పరుగులు చేసింది. దీంతో రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ధోనీ మాట్లాడుతూ.. ‘‘నేను బ్యాటింగ్ కు దిగినప్పుడు ఇంకో రెండు బౌండరీలు కొట్టి జట్టుపై ఒత్తిడి తగ్గించాల్సింది. కాబట్టి ఈ ఓటమికి నాదే బాధ్యత. ఆర్సీబీ జట్టుకు మంచి ఆరంభం లభించింది. అయితే, మేము మధ్య ఓవర్లలో వారిని కట్టడి చేయగలిగాం. ఆఖరి ఓవర్లలో షెఫర్డ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బంతి ఎలా వేసినా సిక్స్ లు బాదేయగలిగాడు. మా బౌలర్లు యార్కర్లు వేయడం బాగా ప్రాక్టీస్ చేయాలి. యార్కర్ వీలు కాకపోతే లోఫుల్ టాస్ తర్వాతి ఉత్తమ ప్రత్యామ్నాయం. బ్యాటింగ్ లో మేం కాస్త మెరుగుపడాలి. ఈరోజు మాత్రం బాగానే ఆడాం’’ అని పేర్కొన్నారు.
MS Dhoni said, “I take the blame. I should’ve converted some of the shots”. pic.twitter.com/4MiMVAASG8
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2025