Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. శుక్రవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది మూడో విజయం కావడం గమనార్హం.
ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. మరో ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ -1.103గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది.
ఎస్ఆర్‌హెచ్ ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లు ఎలా ఉన్నాయంటే..?
చెన్నై పై విజయంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగుఅయ్యాయి. ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ విజయం సాధించాలి. అప్పుడు ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు వచ్చి చేరుతాయి. అయినప్పటికి గత సీజన్లను పరిశీలిస్తే.. ఆ జట్టు నేరుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మిగిలిన జట్ల సమీకరణాలు కూడా కలిసి రావాల్సి ఉంటుంది.
ఒకవేళ మిగిలిన జట్లు 16 పాయింట్ల కంటే తక్కువ సాధిస్తే.. అప్పుడు ఎస్ఆర్‌హెచ్ టాప్-4లో నిలిచి నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. అలా కాకుండా లీగ్ దశ ముగిసిన తరువాత చాలా జట్లు 16 పాయింట్లతో ఉంటే.. అప్పుడు నెట్‌రన్‌రేట్ సైతం కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం ఎస్ఆర్‌హెచ్ నెట్‌రన్‌రేట్ ఏమంత గొప్పగా లేదు. కాబట్టి మిగిలిన మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ భారీ విజయాలను నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా నెట్‌రన్‌రేట్‌ను మరింత మెరుగుపరచుకోవచ్చు.