MS Dhoni : ధోని తెలివితేటలు మామూలుగా లేవుగా.. జడేజా దొరికిపోగానే.. తన బ్యాట్‌ను ఏం చేశాడో చూశారా ? వీడియో వైరల్..
ధోనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. శుక్రవారం చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో సీఎస్‌కే ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. కాగా.. ఇది ధోనికి 400 టీ20 మ్యాచ్ కావడం విశేషం. అయితే.. కెరీర్ మైలుస్టోన్ మ్యాచ్‌లో ధోనికి చేదు అనుభవమై ఎదురైంది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేయర్ల బ్యాట్లను అంపైర్లు తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి ఏ మాత్రం అనుమానం వచ్చినా చాలు.. మైదానంలోనే బ్యాట్లను తనిఖీలు చేస్తున్నారు. బ్యాట్లు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది గేజ్‌ని ఉపయోగించి నిర్ధారించుకుంటున్నారు.
ఈ మ్యాచ్‌లో చెన్నై ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ కు వచ్చిన సమయంలో ఆన్‌ఫీల్డ్ అంపైర్ జడేజా బ్యాట్‌ను చెక్ చేశారు. గేజ్‌ను ఉపయోగించి పరీక్షించాడు. అయితే.. జడ్డూ బ్యాట్ పరీక్షలో విఫలమైంది. దీంతో మరో బ్యాట్ తెప్పించుకుని ఆడాడు జడేజా. డ్రెస్సింగ్ రూమ్ నుంచి దీన్ని గమనించిన కెప్టెన్ ధోని ముందు జాగ్రత్త పడ్డాడు. తన బ్యాట్‌ను స్వయంగా గేజ్‌తో చెక్ చేసుకున్నాడు. అయితే.. ఏదో తేడాగా అనిపించడంతో.. సుత్తి తీసుకుని బ్యాట్‌ను బాదాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. ఈ మ్యాచ్‌లో ధోని మెరుపులు మెరిపించలేకపోయాడు. 10 బంతులు ఎదుర్కొని ఒక్క ఫోర్ బాది కేవలం 6 పరుగులే చేశాడు. దీంతో అభిమానులు అంతా నిరాశ చెందారు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.5 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. చెన్నై బ్యాటర్లలలో డెవాల్డ్ బ్రెవిస్ (42), ఆయుష్ మాత్రే (30)లు రాణించారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్ చెరో రెండు వికెట్లు తీశారు. షమీ, కమిందు మెండీస్ తలా ఓ సాధించారు.
— crictalk (@crictalk7) April 25, 2025
అనంతరం లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (44), కమిందు మెండిస్ (32నాటౌట్)లు రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజాలు తలా ఓ వికెట్ తీశారు.