Courtesy BCCI
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ లో విజేతను డిసైడ్ చేయనున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ కూడా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులే చేసింది. దాంతో సూపర్ ఓవర్ కు దారితీసింది. 2021 తర్వాత ఐపీఎల్ లో సూపర్ ఓవర్ కు దారితీయడం ఇదే తొలిసారి.
రాజస్థాన్ ఆఖరి ఓవర్ లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్ కు దారితీసింది.
Also Read : ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం? ఆ హైదరాబాదీతో జాగ్రత్త.. ఐపీఎల్ జట్లకు బీసీసీఐ హెచ్చరిక..!
రాజస్థాన్ జట్టులో యశస్వి జైస్వాల్, నితీశ్ రానా హాఫ్ సెంచరీలతో రాణించారు. జైస్వాల్ 37 బంతుల్లో 51 పరుగులు, నితీశ్ రానా 28 బంతుల్లో 51 రన్స్ చేశాడు. వీరిద్దరూ చెలరేగినా రాజస్థాన్ గెలవలేకపోయింది.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here