IPL 2025: చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్..

అర్షదీప్ ను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఈ సీజన్ మెగా వేలానికి ముందు వదిలేసింది. అయితే, వేలంలో అతన్ని తిరిగి రూ.18కోట్లు పెట్టి దక్కించుకుంది.

Credit BCCI

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్ ను 14 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత ఓవర్లలో కేవలం 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ జట్టు 12.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 98 పరుగులతో విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఐపీఎల్ లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు.

Also Read: IPL 2025: సొంతగడ్డపై RCB మరోసారి ఓటమి.. కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక కామెంట్స్

పేసర్ అర్షదీప్ సింగ్ ఐపీఎల్ లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. పంజాబ్ కింగ్స్ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అవతరించాడు. ఏప్రిల్ 18న ఆర్సీబీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో అర్షదీప్ ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ వికెట్లు తీయడం ద్వారా పంజాబ్ కింగ్స్ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

Also Read: MI vs SRH : ‘ఈ సారి ఏం రాసుకొచ్చావ్‌..’ అభిషేక్ శ‌ర్మ జేబులు చెక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. వీడియో వైర‌ల్‌..

అర్షదీప్ సింగ్ 2019 సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టులో చేరాడు. గతంలో పంజాబ్ కింగ్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు పియూష్ చావ్లా పేరిట ఉంది. 2000 నుంచి 20213 వరకు పంజాబ్ కింగ్స్ జట్టు తరపున ఆడి 84 వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ సింగ్ 2019 నుంచి ఇప్పటి వరకు పంజాబ్ జట్టు తరపున ఆడుతూ 86 వికెట్లు పడగొట్టాడు. తద్వారా చావ్లా రికార్డును బ్రేక్ చేసి.. పంజాబ్ కింగ్స్ జట్టు తరపున ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. అర్షదీప్ ను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఈ సీజన్ మెగా వేలానికి ముందు వదిలేసింది. అయితే, వేలంలో అతన్ని తిరిగి రూ.18కోట్లు పెట్టి దక్కించుకుంది.

 


ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
అర్షదీప్ సింగ్ – 72మ్యాచ్‌లలో 86 వికెట్లు
పియుష్ చావ్లా – 87మ్యాచ్‌లలో 84 వికెట్లు
సందీప్ శర్మ – 61మ్యాచ్‌లలో 73 వికెట్లు
అక్షర్ పటేల్ – 73మ్యాచ్‌లలో 61 వికెట్లు
మహ్మద్ షమీ – 42మ్యాచ్‌లలో 58 వికెట్లు
పర్వీందర్ అవానా – 38మ్యాచ్‌లలో 48 వికెట్లు