IPL 2025: సొంతగడ్డపై RCB మరోసారి ఓటమి.. కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక కామెంట్స్

సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టుపై ఓటమి అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.

IPL 2025: సొంతగడ్డపై RCB మరోసారి ఓటమి.. కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక కామెంట్స్

IPL 2025 RCB VS PBKS Match (Credit BCCI)

Updated On : April 19, 2025 / 7:24 AM IST

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా శుక్రవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అంపైర్లు 14ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. చివరిలో టిమ్ డేవిడ్ 26బంతుల్లో 50 పరుగులు చేయడంతో ఆర్సీబీ జట్టు 14ఓవర్లలో తొమ్మి వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది.

Also Read: Anaya Bangar : ఫేమస్ క్రికెటర్ కొడుకు.. లింగమార్పిడి చేసుకుని అమ్మాయిగా.. ఆ విషయం తెలిసి కొందరు క్రికెటర్లు ఎంత దారుణమైన ఫొటోలు పంపేవారంటే..

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు 12.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి విజయం సాధించింది. నేహాల్ వధేరా 19 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఏడు మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు ఐదు మ్యాచ్ లలో విజయం సాధించి.. రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఇక ఆర్సీబీ జట్టు మరోసారి సొంతగడ్డపై ఓటమిపాలైంది.

 

ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు సొంతగడ్డపై ఆర్సీబీ జట్టు ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాధించలేక పోయింది. సొంతగడ్డలో (బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం) మూడు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ మూడు మ్యాచ్ లలోనూ ఓటమిపాలైంది. తొలుత గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.. ఢిల్లీ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. తాజాగా.. పంజాబ్ కింగ్స్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. సొంత గడ్డపై జరిగిన మూడు మ్యాచ్ లలో ఓటమి పాలైన ఆర్సీబీ.. ఇతర స్టేడియాల్లో జరిగిన నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించడం గమనార్హం.


మ్యాచ్ ఓటమి అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ‘‘బ్యాటింగ్ సమయంలో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పలేక పోయాం. వెంటవెంటనే వికెట్లు కోల్పోవటంతో ఎక్కువ పరుగులు చేయలేక పోయాం. ఇది మాకు పెద్ద గుణపాఠం. పరిస్థితుల కారణంగా మేము పడిక్కల్ ను జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది. పిచ్ మరీఅంత బ్యాడ్ గా లేదు. కాకపోతే చాలాసేపు కవర్ల కింద ఉండటం వల్ల పంజాబ్ బౌలర్లకు బాగా సాయపడింది. వాళ్లూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ ఎలా ఉన్నా సరే మేము బాగా బ్యాటింగ్ చేయాల్సింది. విజయం సాధించగలిగే స్కోర్ చేయాల్సింది. కొన్ని చిన్న తప్పులను సరిదిద్దుకుంటే మా బ్యాటింగ్ యూనిట్ గా మరింత మెరుగ్గా అవుతుంది’’ అని పటీదార్ అన్నారు.