Anaya Bangar : ఫేమస్ క్రికెటర్ కొడుకు.. లింగమార్పిడి చేసుకుని అమ్మాయిగా.. ఆ విషయం తెలిసి కొందరు క్రికెటర్లు ఎంత దారుణమైన ఫొటోలు పంపేవారంటే..
సంజయ్ బంగర్ కూతురు అనయా బంగర్ సంచలన ఆరోపణలతో మరోసారి వార్తల్లో నిలిచింది.

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు అనయా బంగర్ సంచలన ఆరోపణలతో మరోసారి వార్తల్లో నిలిచింది. అబ్బాయ్ అయిన ఆమె లింగమార్పిడి చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆర్యన్‌గా ఉన్నప్పుడు తనకు క్రికెటర్లతో మంచి సంధాలు ఉండేవని, అనయాగా మారిన తరువాత కొంత మంది నిజస్వరూపాలు బయటపెట్టారని చెప్పింది.
ప్రస్తుతం లండన్‌లో జీవిస్తున్న అనయా.. తన కొత్త ప్రయాణంలో పడిన ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు అమ్మ కప్‌బోర్డు నుంచి దుస్తులు తీసుకుని వేసుకోవడం అలవాటు అయినట్లుగా చెప్పింది. ‘వాటిని వేసుకుని అద్దంలో చూసుకుని మరిసిపోయేదాన్ని. నేను అమ్మాయిని.. అమ్మాయిలాగానే ఉండాలని అనుకున్నాను.’ అని అనయా తెలిపింది.
MI vs SRH : ఇషాన్ కిషన్‌ను ఓదార్చిన నీతా అంబానీ.. బాధపడకు చిన్నోడా..!
‘అబ్బాయిగా ఉన్నప్పుడు క్రికెట్‌ను ఆడాను. ఇప్పుడున్న యువ క్రికెటర్లు ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లతో ఆడాను. అయితే.. నా గురించి ఎవ్వరికి చెప్పలేదు. మానాన్న పెద్ద క్రికెటర్. అందుకే నా విషయాన్ని దాచాల్సి వచ్చింది. క్రికెట్ ప్రపంచం మొత్తం అభ్రదత, మగాళ్ల ఆధిపత్యంతో నిండిపోయింది.’ అని అనయా అంది.
ఇక తన విషయం తెలిశాక కొంత మంది క్రికెటర్లు అండగా నిలిచారని, మరికొంత మాత్రం వేధించారని చెప్పింది. అసభ్యకరమైన ఫోటోలు పంపేవారన్నారు. ఇందులో వారి దుస్తులు లేకుండా ఉండే ఫోటోలు ఎక్కువగా ఉండేవంది.
View this post on Instagram
ఓ సందర్భంలో ఓ వెటరన్ క్రికెటర్ తన వక్ర బుద్ధిని బయటపెట్టాడు. ‘నా పరిస్థితి గురించి అతడికి చెప్పాను. అతడు వెంటనే సరే పద కారులో వెళదాం అంటూ నీతో కలిసి నిద్రించాలని నాకు ఆశగా ఉందని అని అడిగాడు. ఇలాంటి ఇబ్బందులు ఆరంభంలో ఎన్నో పడ్డాను.’ అని అనయా తెలిపింది.
తన తండ్రి సంజయ్ బంగర్ లాగా అనయా కూడా క్రికెట్ ప్లేయర్ కావాలని ఆశపడింది. ఆమె అనయాగా మారకముందు దేశవాళీ క్రికెట్ ఆడింది. ఆ తరువాత ఆమె స్థానిక క్లబ్ క్రికెట్‌లో ఇస్లాం జిమ్‌ఖానా తరపున ఆడింది. లీసెస్టర్‌షైర్లోని హింక్లీ క్రికెట్ క్లబ్‌కు కూడా ప్రాతినిధ్యం వహించింది.
అయితే.. ఐసీసీ నిర్ణయం కారణంగా ఆటకు దూరం కావాల్సి వచ్చింది. మహిళల క్రికెట్‌లోకి ట్రాన్స్ జెండర్‌లకు అవకాశం లేదని ఐసీసీ 2023 నవంబర్‌లో ఓ నిబంధనను తీసుకువచ్చింది. దీనిపై అనయా సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అయిన సంజయ్ బంగర్‌కు ఇద్దరు కొడుకులు. వీరిలో ఆర్యన్ పెద్దవాడు. అయితే.. అతడు శరీర ధర్మానికి అనుగుణంగా తాను అబ్బాయిని కాదు, అమ్మాయిని గుర్తించి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకున్నాడు.