MI vs SRH : ఇషాన్ కిషన్‌ను ఓదార్చిన నీతా అంబానీ.. బాధపడకు చిన్నోడా..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ తన మాజీ ఓనర్ అయిన నీతా అంబాని వద్దకు వెళ్లాడు

pic credit@@CricCrazyJohns
ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 162 పరుగులు మాత్రమే చేయగా, లక్ష్యాన్ని ముంబై 18వ ఓవర్ మొదటి బంతికి ఆరు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం చోటు చేసుకున్న ఓ సన్నివేశానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. ఆ తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ తన మాజీ ఓనర్ అయిన నీతా అంబాని వద్దకు వెళ్లాడు. మర్యాదపూర్వకంగా ఆమెను పలకరించాడు.
Nita Ambani with former MI Boy, Ishan Kishan 🌟 pic.twitter.com/EFPCpk18iC
— Johns. (@CricCrazyJohns) April 17, 2025
ఇక నీతా అంబానీ సైతం చిరునవ్వుతో ఇషాన్‌ను పలకరించింది. ఓ తల్లి మాదిరి ప్రేమగా అతడి చెంపను నిమిరింది. జట్టు ఓడిపోయిందని బాధ పడకు, ఆటలో గెలుపోటములు సహజం అన్నట్లుగా ఆ దృశ్యం కనిపించింది.
2016లో ఇషాన్ కిషన్ ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. గుజరాత్ లయన్స్ అతడిని రూ.35లక్షలకు కొనుగోలు చేసింది. ఆ తరువాత 2018లో అతడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి చేరాడు. అప్పటి నుంచి దాదాపు ఏడేళ్ల పాటు అతడు ముంబై తరుపున ఆడాడు. 2025 మెగా వేలానికి ముందు ముంబై జట్టు ఇషాన్‌ను వదిలివేసింది. వేలంలో అతడిని సన్‌రైజర్స్ రూ.11.25 కోట్లకు దక్కించుకుంది.
ఈ సీజన్‌లో హైదరాబాద్ తరుపున తన తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ శతకంతో చెలరేగాడు. అయితే.. ఆ తరువాత మ్యాచ్ నుంచి అతడు పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ 138 పరుగులు మాత్రమే చేశాడు.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఆజట్టు ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం సన్‌రైజర్స్ 9వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.