MI vs SRH : ‘ఈ సారి ఏం రాసుకొచ్చావ్..’ అభిషేక్ శర్మ జేబులు చెక్ చేసిన సూర్యకుమార్ యాదవ్.. వీడియో వైరల్..
ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ జేబులను ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చెక్ చేశాడు. ఇలా అభిషేక్ జేబులను సూర్య చెక్ చేయడానికి ఓ కారణం ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన గత మ్యాచ్‌లో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ శతకంతో చేలరేగాడు. పంజాబ్ కింగ్స్‌పై విధ్వంసకర శతకం బాదిన అనంతరం జేబులోంచి ఓ నోట్ తీసి అభిషేక్ సంబరాలు చేసుకున్నాడు. ఆ నోట్‌లో ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అని రాసి ఉన్న సంగతి తెలిసిందే.
ఆ మ్యాచ్ అనంతరం ఎస్ఆర్ హెచ్ మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభమైనప్పుడు అభిషేక్ ఆ నోట్ రాసుకున్నాడని, ప్రతి మ్యాచ్‌లోనూ ఆ నోట్‌ను జేబులో పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడని, ఎట్టకేలకు పంజాబ్‌తో మ్యాచ్‌లో అది బయటకు వచ్చిందన్నాడు.
SRH playoff scenario : 7 మ్యాచ్‌ల్లో 5 ఓటమి.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే?
ఈ క్రమంలోనే ముంబై మ్యాచ్‌లో అలాంటి నోట్ ఏమైనా రాసుకొచ్చాడా ? అని అభిషేక్ జేబులను సూర్యకుమార్ యాదవ్ చెక్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
pic.twitter.com/jjE4cpoexd https://t.co/zLCozmFpkf
— 𝘽²⁶⁹ (@mallichudam) April 17, 2025
ఇక ఈ మ్యాచ్‌లో అభిషేక్ 28 బంతుల్లో 7 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. అయినప్పటికి సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది.