SRH playoff scenario : 7 మ్యాచ్‌ల్లో 5 ఓటమి.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే?
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా మిగిలి ఉన్నాయా?

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతుంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు టైటిల్ ఫేవరేట్లలో ఒకటి ఉన్న ఎస్ఆర్‌హెచ్ ఇప్పుడు ప్లేఆఫ్స్ అవకాశాలను కూడా సంక్లిష్టం చేసుకుంటోంది. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.
ఈ సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ పై 286 పరుగుల రికార్డు స్కోరు చేసింది. అయితే.. ఆ తరువాత వరుసగా లక్నో, ఢిల్లీ, కోల్‌కతా, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. అయితే.. పంజాబ్ కింగ్స్ పై 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి మళ్లీ విజయాల బాట పట్టినట్లుగా కనిపించింది. కానీ ముంబై చేతిలో ఓడిపోయి.. ఈ సీజన్‌లో ఐదో ఓటమిని నమోదు చేసింది.
MI vs SRH : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వాంఖడే సిక్సర్ల కింగ్..
ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడింది. రెండు అంటే రెండే మ్యాచ్‌ల్లో విజయాలను సాధించింది. ఎస్ఆర్‌హెచ్ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. రన్‌రేట్ -1.217గా ఉంది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
ప్లే ఆఫ్స్ ఆశలు ఉన్నాయా ?
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ మరో 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే సన్‌రైజర్స్ మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. అప్పుడు 9 విజయాలతో 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఒకవేళ 6 మ్యాచ్‌ల్లో గెలిస్తే అప్పుడు అవకాశం ఉంటుంది కానీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
అంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో పాటు నెట్‌రన్‌రేట్‌ను మెరుగుపరచుకోవాల్సి ఉంది. ఒకవేళ మూడు మ్యాచ్‌ల్లో ఓడితే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది.