MI vs SRH : క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌ను వెనక్కి పంపించి మరీ.. ఔటైన బ్యాటర్‌ను వెనక్కి రప్పించిన థర్డ్ అంపైర్.. ఎందుకిలా చేశాడో తెలుసా?
ముంబై ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది.

IPL 2025 MI vs SRH Why was Ryan Rickelton given not out despite being caught
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. గురువారం వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ (40; 28 బంతుల్లో 7 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (37; 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ రెండు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, పాండ్యాలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
DC vs RR : గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు బీసీసీఐ బిగ్ షాక్..
అనంతరం లక్ష్యాన్ని ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్ (31; 23 బంతుల్లో 5 ఫోర్లు), విల్ జాక్స్ (36; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (26; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (26; 16 బంతుల్లో 3 సిక్సర్లు) లు రాణించారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లో పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీశాడు. ఎషాన్ మలింగ రెండు వికెట్లు సాధించాడు. హర్షల్ పటేల్ వికెట్ సాధించాడు.
ర్యాన్ రికెల్టన్ ఔటైనా మళ్లీ ఎందుకు పిలిచారు?
ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతికి ర్యాన్ రికెల్టన్ కవర్స్ దిశగా షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ చక్కని క్యాచ్ అందుకున్నాడు. దీంతో రికెల్టన్ నిరాశగా పెవిలియన్‌కు నడుచుకుంటూ వెళ్లాడు. బౌండరీ లైన్ కూడా దాటాడు. అదే సమయంలో తదుపరి బ్యాట్స్‌మెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు.
A NO BALL BECAUSE HEINRICH KLAASEN’S GLOVES WERE IN FRONT. pic.twitter.com/QDmqLd76f1
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 17, 2025
అయితే.. బౌండరీ లైన్ దాటి డగౌట్‌కు వెలుతున్న ర్యాన్ రికెల్టన్‌ను ఫోర్త్ అంపైర్ ఆపాడు. ఆ సమయంలో ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు థర్డ్ అంపైర్ అతడు నాటౌట్ అని చెప్పి తిరిగి బ్యాటింగ్ కొనసాగించాలని ఫోర్త్ అంపైర్‌కు చెప్పాడు. అతడు ర్యాన్‌కు చెప్పడంతో అతడు మళ్లీ మైదానంలోకి వచ్చాడు. సూర్య మళ్లీ డగౌట్‌కు వెళ్లిపోయాడు. అప్పటికి ర్యాన్ స్కోరు 21 పరుగులు.
ఎందుకు ర్యాన్ రికెల్టన్‌ను నాటౌట్ ఇచ్చారు అని ప్రేక్షకులు కాస్త అయోమయానికి గురై అయ్యారు. బౌలర్ నోబాల్ వేశాడా అంటే అది కూడా కాదు. వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ ఓ తప్పు చేశాడు. బ్యాటర్ బంతిని బ్యాట్ కొట్టే సమయంలో తన గ్లోవ్స్‌ను వికెట్ల కంటే కాస్త ముందుగా పెట్టాడు.
నిబంధన 27.3.1 ప్రకారం.. బంతి ఆటలోకి వచ్చిన క్షణం నుండి బౌలర్ వేసిన బంతి స్ట్రైకర్ బ్యాట్ లేదా వ్యక్తిని తాకే వరకు లేదా వికెట్లను దాటే వరకు లేదా స్ట్రైకర్ పరుగు కోసం ప్రయత్నించే వరకు వికెట్ కీపర్ వికెట్ల వెనుకాల మాత్రమే ఉండాలి. అతడి గ్లోవ్స్ వికెట్ల ముందుకు తీసుకూడదు. వికెట్ కీపర్ ఈ నిబంధన ఉల్లంఘించిన సమయంలో ఆ బంతిని నోబాల్‌గా ప్రకటిస్తారు.
DC vs RR : ఏందీ భయ్యా.. ఇక్కడ కూడానా.. సూపర్ ఓవర్‌లో పరాగ్ కామెడీ రనౌట్.. వీడియో వైరల్
ముంబైతో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ గ్లోవ్స్ వికెట్ల కంటే కాస్త ముందుకు వచ్చాయి. దీంతో ఆ బంతిని నోబాల్‌గా అంపైర్ ప్రకటించాడు. నోబాల్‌లో ఔటైనా నాటౌట్ కావడంతో రికెల్టన్‌న్‌ను మళ్లీ వెనక్కి పిలిపించారు.