DC vs RR : గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు బీసీసీఐ బిగ్ షాక్..
గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు బీసీసీఐ షాకిచ్చింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీకి భారీ షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఆ జట్టు బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్‌కు భారీ జరిమానా విధించింది. అంతేకాదండోయ్ అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఫలితం తేలచ్చేందుకు సూపర్ ఓవర్ అనివార్యమైంది.
సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ జట్టు 5 బంతులు ఆడి రెండు కోల్పోయి 11 పరుగులు చేసింది. 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ నాలుగు బంతుల్లోనే ఛేదించింది.
అంపైర్‌తో మున్నాఫ్ వాగ్వాదం..
సూపర్ ఓవర్ జరిగే సమయంలో ఢిల్లీ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ ఫోర్త్ అంపైర్‌తో వాదనకు దిగాడు. బౌండరీ లైన్ వద్ద ఫోర్ అంపైర్ నిలుచొని ఉన్నాడు. అక్కడే ఉన్న మునాఫ్ పటేల్ మైదానంలోని తమ జట్టు ఆటగాళ్లకు సందేశం పంపేందుకు వేరే ఆటగాడిని పంపాలని భావించగా.. ఫోర్ల్ అంపైర్ అందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో అంపైర్‌తో మునాఫ్ పటేల్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మునాఫ్ పటేల్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించడంతో అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది ఐపీఎల్ పాలకమండలి. అంతేకాదండోయ్ అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.
DC vs RR : ఏందీ భయ్యా.. ఇక్కడ కూడానా.. సూపర్ ఓవర్‌లో పరాగ్ కామెడీ రనౌట్.. వీడియో వైరల్
Munaf Patel had a heated exchange with the 4th umpire during the #DCvRR match at the Arun Jaitley Stadium, Delhi after the umpire denied sending a player to enter the ground to convey his message.#DCvsRR #IPL2025 pic.twitter.com/hHv0tNAUvd
— Gaurav Chaudhary (@gkctweets) April 16, 2025
‘ఆట స్ఫూర్తికి విరుద్ధమైన ప్రవర్తనకు సంబంధించిన ఆర్టికల్ 2.20 కింద లెవల్ 1 నేరాన్ని మునాఫ్ పటేల్ అంగీకరించాడు. దీనిపై ఎలాంటి అప్పీల్ లు ఇక ఉండవు. ‘అని ఓ ప్రకనటలో ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.