DC vs RR : ఏందీ భ‌య్యా.. ఇక్క‌డ కూడానా.. సూప‌ర్ ఓవ‌ర్‌లో ప‌రాగ్ కామెడీ ర‌నౌట్‌.. వీడియో వైర‌ల్‌

రియాన్ ప‌రాగ్ ర‌నౌట్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

DC vs RR : ఏందీ భ‌య్యా.. ఇక్క‌డ కూడానా.. సూప‌ర్ ఓవ‌ర్‌లో ప‌రాగ్ కామెడీ ర‌నౌట్‌.. వీడియో వైర‌ల్‌

Courtesy BCCI

Updated On : April 17, 2025 / 9:38 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మ్యాచ్ లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. బుధ‌వారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ టైగా మారింది. దీంతో ఫ‌లితం కోసం సూప‌ర్ ఓవ‌ర్‌ను నిర్వ‌హించారు. ఈ సూప‌ర్ ఓవ‌ర్‌లో ఢిల్లీ విజ‌యాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. అభిషేక్‌ పోరెల్‌ (49), కేఎల్ రాహుల్‌ (38), స్టబ్స్‌ (34 నాటౌట్‌), అక్షర్‌ పటేల్ (34 )లు రాణించ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. అనంత‌రం నితీశ్‌ రాణా (51), యశస్వి జైస్వాల్‌ (51) లు హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగ‌డంతో ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ కూడా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి స‌రిగ్గా 188 ప‌రుగులు చేసింది.

DC vs RR : ఓడిపోయే మ్యాచ్‌లో గెల‌వ‌డం పై ఢిల్లీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ కామెంట్స్‌.. ఆ ఒక్క‌డి వ‌ల్లే ఇదంతా..

ఫ్రీ హిట్‌కి ప‌రాగ్ ర‌నౌట్‌..

మ్యాచ్ టైగా మార‌డంతో సూప‌ర్ ఓవ‌ర్‌ను నిర్వ‌హించారు. రాజ‌స్థాన్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ ప‌రాగ్‌లు బ్యాటింగ్‌కు దిగారు. మిచెల్ స్టార్ బౌలింగ్ చేయ‌గా తొలి బంతికి ప‌రుగు రాలేదు రెండో బంతికి హెట్మెయ‌ర్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి సింగిల్ తీశాడు. నాలుగో బంతికి రియాన్ ప‌రాగ్ ఫోర్ కొట్టాడు. అయితే..ఈ బంతి నోబాల్. మ‌ళ్లీ మిచెల్ స్టార్ నాలుగో బంతి వేయ‌గా ప‌రాగ్ ప్యాడ్లను తాకుతూ బంతి వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ చేతుల్లో వెళ్లింది.

హెట్మెయ‌ర్ ప‌రుగు కోసం పిలిచాడు. హెట్మెయ‌ర్ ఔట్ కాకూడ‌దు అన్న ఉద్దేశ్యంతో అత‌డు వ‌చ్చేంత వ‌ర‌కు ప‌రాగ్ క్రీజును వీడ‌లేదు. ఆ త‌రువాత ప‌రిగెత్త‌డం ప్రారంభించాడు. ఈ లోపు రాహుల్ బంతిని వికెట్ల వైపు త్రోగా చేయ‌గా అది మిస్సైంది. బంతిని అందుకున్న బౌల‌ర్ స్టార్క్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. ప్ర‌స్తుతం ప‌రాగ్ ర‌నౌట్‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

DC vs RR : మ్యాచ్‌లో దీన్ని గ‌మ‌నించారా? ఔట్ కాకుండానే మైదానం వీడిన సంజూ శాంస‌న్‌.. ఓడిన రాజ‌స్థాన్‌..!

ప‌రాగ్ ఔట్ కావ‌డంతో జైస్వాల్ క్రీజులోకి వ‌చ్చాడు. ఐదో బంతిని ఎదుర్కొన్న హెట్మెమ‌య‌ర్ షాట్ ఆడాడు. రెండు ప‌రుగుల కోసం ప్ర‌య‌త్నించ‌డంతో జైస్వాల్ ర‌నౌట్ అయ్యాడు. దీంతో రాజ‌స్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఢిల్లీ ముందు 12 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. ఈ ల‌క్ష్యాన్ని ఢిల్లీ నాలుగు బంతుల్లో ఛేదించింది.