RCB vs PBKS : బెంగళూరు వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి? ఏ జట్టుకు లాభం ?
శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.

Will rain play spoilsport RCB vs PBKS at M Chinnaswamy stadium
ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసుకు మరింత దగ్గర కావాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇది అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.
ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సొంత మైదానంలో ఆడిన ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆర్‌సీబీ 6 మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓడిపోయిన ఈ రెండు మ్యాచ్‌లు కూడా సొంత మైదానంలో ఆడడం గమనార్హం.
SRH playoff scenario : 7 మ్యాచ్‌ల్లో 5 ఓటమి.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే?
మ్యాచ్ రద్దు అవుతుందా?
అక్యూవెదర్ ప్రకారం బెంగళూరులో కొన్ని ప్రదేశాల్లో మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. సాయంత్రం వాతావరణం మెరుగ్గానే ఉండే ఛాన్స్ ఉంది. ఇక మ్యాచ్ జరిగే సమయం రాత్రి 7 నుంచి 11 గంటల మధ్యలో 12 శాతం వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
కాగా.. చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ఎంత పెద్ద వర్షం పడినా నిమిషాల వ్యవధిలోనే మైదానాన్ని సిద్ధం చేయవచ్చు. భారీ వర్షం పడినా.. వర్షం ఆగిన 30 నిమిషాల్లోనే మైదానాన్ని సిద్ధం చేయొచ్చు. దీంతో వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయ్యే పరిస్థితులు చాలా తక్కువ.
MI vs SRH : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వాంఖడే సిక్సర్ల కింగ్..
ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే.. అప్పుడు ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయిస్తారు.
హెడ్-టు-హెడ్..
పంజాబ్, ఆర్‌సీబీ జట్లు ఇప్పటి వరకు 33 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో ఆర్‌సీబీ 16 మ్యాచ్‌ల్లో గెలవగా, పంజాబ్ కింగ్స్ 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు మూడో స్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో ఉంది. ఇరు జట్లు కూడా ఇప్పటి వరకు చెరో 6 మ్యాచ్‌లు ఆడగా నాలుగింటిలో విజయం సాధించాయి. ఇరు జట్ల ఖాతాల్లో 8 పాయింట్లే ఉన్నాయి. అయితే.. బెంగళూరు నెట్‌రన్‌రేట్ (+0.672) పంజాబ్ నెట్‌రన్‌రేట్ (+0.172) కంటే కాస్త మెరుగ్గా ఉంది.