Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం చిన్నస్వామి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విఫలం అయ్యాడు. ఈ దిగ్గజ ఆటగాడు మూడు బంతులను ఎదుర్కొని ఒక్క పరుగు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో అతడిపై బ్యాటింగ్ తీరుపై విమర్శలు వస్తున్నాయి.
పంజాబ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ నిర్లక్ష్యంగా షాట్ ఆడి పెవిలియన్‌కు చేరుకున్నాడని టీమ్ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ తెలిపాడు. కోహ్లీ 6 ఓవర్ల మ్యాచ్‌గా భావించి తొలి బంతి నుంచే హిట్టింగ్ వెళ్లాడని, ఫలితంగా ఔట్ అయ్యాడని విమర్శించాడు.
RR vs LSG : ద్రవిడ్‌తో విభేదాలు.. లక్నోతో మ్యాచ్‌కు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ దూరం?
‘సాధారణంగా కోహ్లీ 20 ఓవర్ల మ్యాచ్‌లో ఇలాంటి షాట్లు ఆడడు. ఇది 14 ఓవర్ల మ్యాచ్ కావడంతో కోహ్లీ తొలి బంతి నుంచే హిట్టింగ్ చేయాలని అనుకున్నాడు. ఇంత కఠినమైన పిచ్‌పై కొంత సమయం తీసుకుని ఆడితే బాగుండేది. కోహ్లీ కనీసం 5 బంతుల వరకు ఓపిక పట్టి ఆ తరువాత దూకుడుగా ఆడితే బాగుండేది. అయితే.. కోహ్లీ ఈ మ్యాచ్‌ను 6 ఓవర్ల మ్యాచ్‌గా భావించాడు. అందుకే చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాడు.’ అని కైఫ్ అన్నాడు.
వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 14 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులే చేసింది. అనంతరం 96 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
RCB vs PBKS : ఆర్‌సీబీ ఇజ్జత్ కాపాడిన టిమ్ డేవిడ్.. తన బ్యాటింగ్ స్థానంపై సంచలన వ్యాఖ్యలు..
ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కోహ్లీ 7 మ్యాచ్‌ల్లో 49.80 సగటుతో 141.47 స్ట్రైక్ రేట్‌తో 249 పరుగులు సాధించాడు, ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.