RR vs LSG : ద్రవిడ్‌తో విభేదాలు.. లక్నోతో మ్యాచ్‌కు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ దూరం?
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో నేడు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. నాలుగు పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ -0.714గా ఉంది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. రాజస్థాన్ రాయల్స్ జట్టులో విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ సమయంలో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ఆ వార్తల సమాచారం. దీనిపై ఇప్పటికే ద్రవిడ్ స్పందించాడు. ఎలాంటి విభేదాలు లేవని చెప్పాడు. అయినప్పటికి జట్టులో ఏదో జరుగుతుందని అంటున్నారు.
RCB vs PBKS : 4, 1, 23, 4, 2 , 1, 50, 1, 8, 0, 0.. ఇది ఆర్‌సీబీ ఫోన్ నంబరా?
ఈ క్రమంలో నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఆడడం అసాధ్యంగానే కనిపిస్తోంది. అయితే.. ఇందుకు కారణం ద్రవిడ్‌తో విభేదాలు మాత్రం కాదు. సంజూ శాంసన్ పూర్తి ఫిట్‌గా లేకపోవడమే అని తెలుస్తోంది.
ఢిల్లీతో మ్యాచ్‌లో పక్కటెముకల గాయంతో సంజూ ఇబ్బంది పడ్డాడు. ఆ మ్యాచ్‌లో రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు అతడికి స్కానింగ్ నిర్వహించారు. ఆ స్కానింగ్ ఫలితం ఇంకా రావాల్సి ఉందని, అది వచ్చిన తరువాతనే సంజూ లక్నో మ్యాచ్‌లో ఆడలా? వద్దా అన్నది నిర్ణయిస్తామని, లక్నోతో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ద్రవిడ్ వెల్లడించాడు.
RCB vs PBKS : ఆర్‌సీబీ ఇజ్జత్ కాపాడిన టిమ్ డేవిడ్.. తన బ్యాటింగ్ స్థానంపై సంచలన వ్యాఖ్యలు..
సంజూ దూరం అయితే కెప్టెన్ ఎవరు?
సంజూ శాంసన్ గాయం కారణంగా లక్నోతో మ్యాచ్‌కు దూరం అయితే.. అతడి స్థానంలో రియాన్ పరాగ్ నాయకత్వ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది. ఈ సీజన్ ప్రారంభంలోని ఆర్ఆర్ ఆడిన మూడు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ ఓడిపోగా, మరో మ్యాచ్‌లో విజయం సాధించింది.