RCB vs PBKS : 4, 1, 23, 4, 2 , 1, 50, 1, 8, 0, 0.. ఇది ఆర్‌సీబీ ఫోన్ నంబరా?
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగులోంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగులోంది. హోం గ్రౌండ్ మ్యాచ్‌ల్లో చతికిల పడుతున్న ఆ జట్టు బయట మాత్రం చెలరేగి ఆడుతోంది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆర్‌సీబీ 7 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో గెలవగా, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓడిపోయిన ఈ మూడు మ్యాచ్‌లు కూడా ఆర్‌సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడినవే కావడం గమనార్హం.
శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాటర్ల ప్రదర్శన పట్ల ఆ జట్టు అభిమానులు సైతం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒక్క టిమ్ డేవిడ్ మినహా మిగిలిన వారంతా పెవిలియన్‌కు వెళ్లేందుకు పోటీపడినట్లుగా అనిపించింది. వర్షం వల్ల 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు.
RCB vs PBKS : ఆర్‌సీబీ ఇజ్జత్ కాపాడిన టిమ్ డేవిడ్.. తన బ్యాటింగ్ స్థానంపై సంచలన వ్యాఖ్యలు..
మిగిలిన వారిలో కెప్టెన్ రజత్ పాటిదార్ (23) ఒక్కడే రెండు అంకెల స్కోరు సాధించాడు. మిగిలిన అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ (1), ఫిల్ సాల్ట్ (4), లియామ్ లివింగ్ స్టోన్ (4), జితేశ్ శర్మ (2), కృనాల్ పాండ్యా (1)లు దారుణంగా విఫలం అయ్యారు. దీంతో ఆర్‌సీబీ బ్యాటర్ల పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఆ జట్టు స్కోరు కార్డును పోస్ట్ చేస్తూ.. 4, 1, 23, 4, 2, 1, 50, 1, 8, 0, 0 ఇది ఆర్‌సీబీ ఫోన్ అని విమర్శిస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఖాతాలో ప్రస్తుతం 8 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఆ జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది. ఐపీఎల్ 18వ సీజన్‌లో ఇప్పటి వరకు సగం సీజన్ పూర్తి అయింది. దీంతో మున్ముందు ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతుంది. ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్ కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేస్తుంటుంది. కాబట్టి వీలైన త్వరగా ఆర్‌సీబీ బ్యాటర్లు ఫామ్ అందుకుని మ్యాచ్‌లు గెలిపించాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక ఆర్‌సీబీ తన తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 20 ఆదివారం ఆడనుంది. పంజాబ్ కింగ్స్‌తోనే తలపడనుంది. ఈ మ్యాచ్‌కు పంజాబ్‌లోని మొహాలిలోని ముల్లన్‌పూర్‌లో మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.