RCB vs PBKS : 18 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. భలే విచిత్రంగా ఉందే.. నీకే ఎందుకు ఇలా కోహ్లీ భయ్యా..
ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు.

Courtesy BCCI
ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా.. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యాదృచ్ఛికంగా ఓ ఘటన చోటు చేసుకుంది.
2008 ఏప్రిల్ 18న ఐపీఎల్ ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇచ్చిన ఆ మ్యాచ్‌లో ఆర్‌సీబీ తరుపున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. కేకేఆర్ పేసర్ ఆశోక్ దిండా బౌలింగ్‌లో కోహ్లీ ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 140 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.
IPL 2025: చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్..
𝙈𝙤𝙩𝙝𝙚𝙧 𝙤𝙛 𝙘𝙤𝙞𝙣𝙘𝙞𝙙𝙚𝙣𝙘𝙚! 🤯#IPL2025 #ViratKohli #RCBvsPBKS pic.twitter.com/T36lwHG6yL
— OneCricket (@OneCricketApp) April 18, 2025
కట్ చేస్తే.. 17 ఏళ్ల తరువాత మళ్లీ ఏప్రిల్ 18న ఆడే అవకాశం వచ్చింది. అదే చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు బంతులను ఎదుర్కొని ఒక్క పరుగే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. వర్షం వల్ల 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 95 పరుగులే చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దీంతో క్రికెట్ ఫ్యాన్స్ 18 ఏళ్ల తరువాత సేమ్ సీన్ రిపీట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 18న రోజు విరాట్ కోహ్లీ రాత మాత్రం మారలేదని అంటున్నారు. అప్పుడు, ఇప్పుడు కేవలం ఒక్క పరుగే ఔట్ అయ్యాడని అంటున్నారు.
IPL 2025: సొంతగడ్డపై RCB మరోసారి ఓటమి.. కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక కామెంట్స్
ఐపీఎల్‌లో విజయవంతమైన బ్యాటర్లలో కోహ్లీ ఒకడు. ఇప్పటి వరకు కోహ్లీ 259 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడాడు. 38.9 సగటు 132.2 స్ట్రైక్‌రేట్‌తో 8253 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలు 58 అర్థశతకాలు ఉన్నాయి.