IPL 2025 : చెలరేగిన కృనాల్ పాండ్య, ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులే చేసింది.

Courtesy BCCI

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రివెంజ్ తీర్చుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో డీసీపై బెంగళూరు ఘన విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు ఉండగానే చేధించింది. 6 వికెట్ల తేడాతో డీసీని చిత్తు చేసింది ఆర్సీబీ. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య చెలరేగారు. హాఫ్ సెంచరీలతో మెరిశారు.

కృనాల్ 47 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. నాలుగు సిక్సులు, 5 ఫోర్లు బాదాడు. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. పవర్ ప్లే లో ఢిల్లీ బౌలర్లు 3 వికెట్లు తీసినా.. కోహ్లీ, కృనాల్ రాణించారు. చివరలో టిమ్ డేవిడ్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 5 బంతుల్లోనే 19 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Also Read: ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల భార్యల గురించి తెలుసా? వారందరూ వీరే.. ఎంతగా సపోర్ట్‌ చేస్తున్నారంటే?

ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది హ్యాట్రిక్ విజయం. ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడిన బెంగళూరు 7 మ్యాచుల్లో గెలిచింది. పాయింట్స్ టేబుల్ లో టాప్ 1లోకి దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచుల్లో 6 విజయాలతో పాయింట్స్ టేబుల్ లో 4వ స్థానంలో ఉంది.