Pic: @IPL (X)
ఐపీఎల్ 2025లో భాగంగా హైదరాబాద్‌లో జరుగుతున్న మ్యాచులో గుజరాత్ టైటాన్స్ కు సన్‌రైజర్స్ హైదరాబాద్ 153 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి నుంచి పేలవ ప్రదర్శన కనబర్చింది.
Also Read: బంపర్ ఆఫర్.. 50 శాతం డిస్కౌంట్‌తో టాప్ బ్రాండ్ ఏసీ.. మీ ఇల్లంతా కూల్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 18, ట్రావిస్ హెడ్ 8, ఇషాన్ కిషన్ 17, నితీశ్ కుమార్ రెడ్డి 31, హెన్రిచ్ 27, అనికెత్ వర్మ 18, కమిండ్ మెండిస్ 1, పాట్ కమిన్స్ 22 (నాటౌట్), సిమర్జీత్ సింగ్ 0, షమీ 6 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో, హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు తీసింది.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సిరాజ్ 4, ప్రసిద్ కృష్ణ , సాయి కిశోర్ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. కేవలం ఒకే ఒక్క మ్యాచులో గెలిచింది. హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టిక చివరి స్థానంలో కొనసాగుతోంది.